Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: విరాట్ కోహ్లీ డ‌కౌట్‌.. క‌ష్టాల్లో టీమిండియా!!

India vs England: Ben Stokes gets a break, Virat Kohli out for 0

అహ్మ‌దాబాద్‌: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 41 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కీలక కోల్పోయింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. బెన్ స్టోక్స్‌ వేసిన 26వ ఓవర్‌ నాలుగో బంతిని కోహ్లీ ఫ్లిక్‌ చేయగా.. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కి తాకి కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ చేతిలో పడింది. అనూహ్యంగా దూసుకొచ్చిన షార్ట్‌పిచ్ బంతి ఆడ‌లేక కోహ్లీ వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 35 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌, రహానే ఉన్నారు.

భారత్ 24/1 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు కొనసాగించింది. తొలి గంట‌సేపు వికెట్ ప‌డ‌కుండా కాచుకున్నా.. త‌ర్వాత వెంటవెంట‌నే రెండు వికెట్లు కోల్పోయింది. మొద‌ట ఓవ‌ర్‌నైట్ బ్యాట్స్‌మ‌న్ చేటేశ్వర్ పుజారా (17).. స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్‌లో ఎల్బీడ‌బ్ల్యూగా వెనుదిరిగాడు. పుజారా రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో భారత్ 40 పరుగుల వద్ద రెండో వికెట్‌ నష్టపోయింది. ఆ త‌ర్వాత క్రీజులో వ‌చ్చిన కెప్టెన్ కోహ్లీ డ‌కౌట‌య్యాడు. దీంతో భారత్ కష్టాల్లో పడింది.

ఒకవైపు వికెట్లు పడుతున్నా.. రోహిత్ శర్మ మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానే.. రోహిత్ శర్మకు జతగా క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నా.. జింక్స్ బౌండరీలు బాదుతూ వారిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. స్వల్ప వ్యవధిలో పుజారా, కోహ్లీ ఔటవ్వడంతో ఇప్పుడు భారమంతా రోహిత్‌, రహానే పైనే ఉంది. వీరిద్దరు మరింత జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం భారత్ 35 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ (31)‌, రహానే (18) పరుగులతో ఉన్నారు. భారత్‌ ఇంకా 135 పరుగుల వెనుకంజలో ఉంది.

గురువారం ప్రారంభం అయిన నాలుగో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 205 పరుగులకు ఆలౌటైంది. బెన్‌ స్టోక్స్‌ (55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకం చేయగా.. డాన్ లారెన్స్‌ (46; 8 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ (4/68), ఆర్ అశ్విన్‌ (3/47) మరోసారి మాయ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్ గురువారం ఆట ముగిసే సమయానికి గిల్‌ (0) వికెట్‌ కోల్పోయి 24 పరుగులు చేసింది.

Story first published: Friday, March 5, 2021, 11:37 [IST]
Other articles published on Mar 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+