న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PinkBall Test: ఎంఎస్ ధోనీ రికార్డులా.. నేను అలాంటివి పట్టించుకోను: కోహ్లీ

Means Nothing To Me: Virat Kohli on possibly breaking MS Dhonis Test captaincy Record

అహ్మదాబాద్: రికార్డుల గురించి తాను అసలు పట్టించుకోనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. మరో విజయం సాధిస్తే స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. ధోనీ సారథ్యంలో టీమిండియా భారత్‌లో 21 విజయాలు సాధించగా.. కోహ్లీ నేతృత్వంలో 21 విజయాలు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌ సిరీస్‌లో కోహ్లీ మరో టెస్ట్ విజయం సాధిస్తే ధోనీకి చెందిన ఈ రికార్డును అధిగమిస్తాడు. మొతెరా వేదికగా బుధవారం నుంచి డే/నైట్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కోహ్లీ మీడియా సమావేశంలో మాట్లాడాడు.

రికార్డులు పట్టించుకోను:

రికార్డులు పట్టించుకోను:

మరో విజయం సాధిస్తే స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన భారత సారథిగా మీరు నిలువనున్నారు కదా?.. దీనిపై మీ స్పందన ఎలా ఉంది? అని అడగ్గా.. 'రికార్డులు అస్థిరమైనవి. బయటి నుంచి ఇద్దరు వ్యక్తులను పోల్చడం బాగుంటుంది. కానీ అలాంటి విషయాల్ని మేం అసలు పట్టించుకోం. సహచర ఆటగాళ్లుగా మాజీ సారథిపై మాకు ఎంతో గౌరవం, ప్రేమ, అభిమానం ఉంటాయి' అని విరాట్ కోహ్లీ చెప్పాడు. మూడో టెస్టులో కోహ్లీ సెంచరీ సాధిస్తే.. ప్రపంచంలో మూడో బ్యాట్స్‌మన్‌గా, పింక్ బాల్ టెస్టులో రెండు సెంచరీలు చేసిన తొలి సారథి‌గా కొత్త చరిత్ర సృష్టించనున్నాడు.

బలహీనతల గురించి ఆలోచించట్లేదు:

బలహీనతల గురించి ఆలోచించట్లేదు:

'ఇంగ్లండ్‌ జట్టు బలాలు, బలహీనతల గురించి ఆలోచించట్లేదు. పేస్‌కు అనుకూలించే వాళ్ల సొంత మైదానంలోనే వాళ్లని ఓడించాం. జట్టుగా పోరాడి విజయాలు సాధించాం. బలహీనతలు గురించి మాట్లాడితే.. ప్రత్యర్థి జట్టులో అవి చాలానే ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పేస్ ‌పిచ్‌ వాళ్లకు అనుకూలంగా ఉంటే.. అది మాకు లాభమే. ఎందుకంటే.. ఇతర జట్ల కంటే బలమైన బౌలింగ్ దళం మాకు కూడా ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా గొప్ప ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉన్నాం' అని కోహ్లీ అన్నాడు.

రెండు మ్యాచ్‌లూ గెలవాలని చూస్తున్నాం:

రెండు మ్యాచ్‌లూ గెలవాలని చూస్తున్నాం:

'గులాబి బంతితో ఆడటం సవాలే‌. ముఖ్యంగా సాయంత్రం బ్యాటింగ్ చేసే జట్టుకు లైట్లు వెలుతురులో తొలి గంటన్నర ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తుంది. అయితే బంతిపై షైన్‌ ఉన్నంతవరకు ఫాస్ట్ బౌలర్లకు కూడా సహకరిస్తుంది' అని కోహ్లీ చెప్పాడు. 'ఒక మ్యాచ్‌‌ డ్రాగా ముగించి, మరొకటి విజయం సాధించాలని మేం భావించట్లేదు. రెండు మ్యాచ్‌లూ గెలవాలని ప్రయత్నిస్తున్నాం. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫలితం గురించి తర్వాత ఆలోచిస్తాం' అని భారత కెప్టెన్ తెలిపాడు.

 ఇంగ్లండ్‌కు ఓ చెత్త రికార్డు ఉంది:

ఇంగ్లండ్‌కు ఓ చెత్త రికార్డు ఉంది:

ఆస్ట్రేలియాతో జరిగిన గత డే/నైట్ టెస్టులో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలింది. ఆ ఫలితం ఏమైనా ప్రభావితం చూపిస్తుందా అని అడిగిన ప్రశ్నకు.. '45 నిమిషాల పేలవమైన ఆటతో అలా జరిగిపోయింది. అలాంటి ఆట ఎప్పటికీ చేదు జ్ఞాపకమే. అయితే ఇంగ్లండ్‌కు కూడా ఓ చెత్త రికార్డు ఉంది' అని విరాట్ కోహ్లీ అన్నాడు. 2018లో న్యూజిలాండ్‌తో జరిగిన డే/నైట్‌ టెస్టులో ఇంగ్లీష్ జట్టు 58 పరుగులకు ఆలౌటైంది.

'అంపైర్‌ కాల్' రద్దు చేయబడుతుందా? ఎంసీసీ సమావేశంలో గంగూలీ, పాంటింగ్, సంగక్కర ఏం చెప్పారు!

Story first published: Tuesday, February 23, 2021, 22:16 [IST]
Other articles published on Feb 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X