For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

9 సంవత్సరాల తర్వాత.. ఎంఎస్ ధోనీ సిక్స్‌ కొట్టిన బంతి దొరికింది!!

MCA Find MS Dhonis 2011 World Cup Final Six Ball

ముంబై: 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ శ్రీలంక పేసర్ నువాన్ కులశేఖర బౌలింగ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్‌తో యావత్ భారత దేశం ఉప్పొంగింది. ఆ అద్భుత క్షణాన్ని అంత సులభంగా ఏ భారత క్రికెట్ అభిమాని మర్చిపోడు. ఇక 'ధోనీ ఫినిష్డ్‌ ఆఫ్‌ ఇన్‌స్టయిల్‌.. ఇండియా లిఫ్ట్ వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్' అని రవిశాస్త్రి వ్యాఖ్యానంను టీవీల్లో చూసిన వారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఎందుకంటే 2011 ఏప్రిల్‌ 2న భారత జట్టు రెండోసారి వన్డే వరల్డ్‌ కప్‌ గెలుచుకున్న చారిత్రాత్మక రోజది.

ఎం‌సీఏ వెతుకులాట

ఎం‌సీఏ వెతుకులాట

2011 ప్రపంచకప్‌ ఫైనల్లో సిక్సర్‌గా వెళ్లిన బంతిని ఎవరూ పట్టించుకోకపోయినా.. ఎంఎస్ ధోనీ ఇటీవల రిటైర్‌మెంట్‌ ప్రకటించిన సమయంలో దానిపై చర్చ నడిచింది. ధోనీని ప్రత్యేకంగా గౌరవించాలని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎం‌సీఏ) నిర్ణయించింది. ఫైనల్లో ధోనీ కొట్టిన బంతి పడిన సీటును శాశ్వతంగా అతని కోసం కేటాయించాలని అసోసియేషన్‌ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు క్రికెట్‌ గవర్నింగ్ బాడీకి లేఖ రాశారు. అనంతరం మహీ కొట్టిన బంతి ఎక్కడ పడింది. దాన్ని ఎవరు తీసుకున్నారు అనే దానిపై ఎం‌సీఏ వెతుకులాట ప్రారంభించింది. చివరకు ఆచూకీ తెలిసింది.

మ్యాచ్‌ టికెట్‌తో సహా

మ్యాచ్‌ టికెట్‌తో సహా

దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఈ విషయంలో ఎం‌సీఏ సహకారం అందిస్తానని చెప్పారు. ఆ మ్యాచ్‌లో మహీ కొట్టిన బంతిని అందుకున్న అభిమాని గురించి తనకు తెలుసని, తన మిత్రుడు ఒకరికి అతనితో పరిచయం ఉందని సన్నీ ఎంసీఏకు తెలియజేశారు. దాంతో ఎంసీఏ ఇతర ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధమైంది. సదరు వ్యక్తి ఆ మ్యాచ్‌ టికెట్‌తో సహా బంతిని ఒక జ్ఞాపికగా మలచి భద్రపరచినట్లు సమాచారం. ఆ బంతి ఎంసీఏ పెవిలియన్‌ స్టాండ్, ఎల్‌ బ్లాక్‌లోని 210 నంబర్‌ సీటుపై పడింది. ఇప్పుడు ఆ సీటును ఇతర సీట్లకంటే భిన్నంగా ఉండేలా, ప్రత్యేకంగా కనిపించేలా సిద్ధం చేసి ధోనీ పేరుతో దానిని జ్ఞాపికగా మార్చనున్నారు. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్ 2020 కోసం యూఏఈలో ఉన్న విషయం తెలిసిందే.

 భారత్‌లో తొలిసారి

భారత్‌లో తొలిసారి

ఎంఎస్ ధోనీ కొట్టిన బంతి పడిన సీటును అందంగా అలంకరించటంతో పాటు ప్రత్యేక అక్షరాలతో ఫలకాన్ని సైతం ఏర్పాటు చేస్తామని ఎమ్‌సీఏ సభ్యుడు తెలిపారు. దీంతో భవిష్యత్తులో మ్యాచ్‌లు చూడటానికి స్టేడియానికి వచ్చే అభిమానులు మహీ కొట్టిన సిక్స్‌ పడిన ప్రాంతాన్ని చూసి ప్రపంచకప్‌ గెలిచిన ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటారన్నారు. ఈ తరహాలో అంకితం చేయడం భారత్‌లో తొలిసారి అయినా గతంలోనూ క్రికెట్‌లో ఇలా జరిగాయి.

ఇలియట్‌ కొట్టిన సిక్సర్‌ను కూడా

ఇలియట్‌ కొట్టిన సిక్సర్‌ను కూడా

ఆ్రస్టేలియా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో సైమన్‌ ఒడొనెల్‌ 122 మీటర్ల సిక్స్‌ కొట్టిన సీటును, బిగ్‌ బాష్‌లో బ్రాడ్‌ హాడ్జ్‌ చివరి మ్యాచ్‌ ఆడినప్పుడు కొట్టిన 96 మీటర్ల సిక్సర్‌ సీటును ఇలాగే మార్చారు. ఇక 2015 ప్రపంచకప్‌ సెమీస్‌లో డేల్ స్టెయిన్‌ బౌలింగ్‌లో గ్రాంట్‌ ఇలియట్‌ కొట్టిన సిక్సర్‌తో న్యూజిలాండ్‌ తొలిసారి ఫైనల్‌ చేరింది. ఆక్లాండ్‌లో ఆ బంతి పడిన సీటును ఇలాగే మార్చారు.

ఐపీఎల్ 2020 కోసం చాలా కష్టపడ్డా.. 20 వేల బంతుల్ని ఎదుర్కొన్నా: శాంసన్‌

Story first published: Thursday, September 24, 2020, 18:44 [IST]
Other articles published on Sep 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+