
రీఎంట్రీ కోసం..
రెండేళ్ల గ్యాప్ తర్వాల మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు మయంతి ప్రయత్నాలు చేస్తున్నట్లు టీవీ వర్గాలు పేర్కొన్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సీజన్ ఐపీఎల్‌లోనే ఆమె మళ్లీ అభిమానులను అలరించే అవకాశం ఉంది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేస్తున్న ప్రమోషనల్ వీడియోలు, క్రికెట్ సంబంధించిన పోస్ట్‌లు మయంతి రీఎంట్రీ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రెగ్నన్సీ కారణంగా చాలా సన్నబడిన మయాంతి.. మళ్లీ తన పూర్వ రూపం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫిఫా కప్‌తో తొలిసారిగా..
1985 ఫిబ్రవరి 8న ఢిల్లీలో జన్మించిన మయంతి స్థానిక హిందూ కాలేజీలో గ్యాడ్యూయేషన్ పూర్తి చేసింది. కాలేజీలో నిర్వహించే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించేది. దీంతో పీజీ చేస్తుండగానే జీ స్పోర్ట్స్‌లో యాంకర్‌గా అవకాశం వచ్చింది. తన పెర్ ఫార్మెన్స్ చాలా మందికి నచ్చడంతో ఆమె కెరీర్ తారా జువ్వలా దూసుకుపోయింది. 2010లో ఫిఫా ప్రపంచకప్‌కి తొలిసారి వాఖ్యాతగా వ్యవహరించింది. అక్కడ విజయవంతం కావడంతో 2010లో ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ క్రీడలకు టీవీ ప్రెజెంటర్‌గా చేసింది. ఇక అప్పటినుంచి ఐపీఎల్, ప్రపంచకప్‌లకు వ్యాఖ్యాతగా కొనసాగుతోంది. ఐపీఎల్‌లో బెస్ట్ యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకుంది.

ఆమె కోసమే..
మ్యాచ్‌కు ముందు జరిగే విశ్లేషణలను చాలా మంది మయంతి కోసమే చూస్తారంటే అతిశయోక్తి కాదు. 2013లో క్రికెటర్ స్టువార్ట్ బిన్నిని వివాహం చేసుకున్న ఆమె.. వస్త్రధారణ విషయంలో ట్రోలింగ్ గురువతూంటుంది. ఇక స్టువర్ట్ బిన్నీ వ్యవహారంతో కూడా అభిమానులు గేలిచేసే ప్రయత్నం చేస్తారు. ఇక అభిమానుల ట్రోలింగ్‌ను మయంతి తనదైన శైలిలో తిప్పుకొడుతుంది.


Click it and Unblock the Notifications












