Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: ఈ సారి కూడా ఆ గ్లామ్ డాల్ దూరం.. మన్నల్ని అలరించే హాట్ యాంకర్లు వీరే!

Mayanti Langer to miss IPL 2021 too, Here list of TV presenters and hosts from Star Sports
IPL 2021 : హాట్ యాంకర్లు వీరే, Mayanti Langer ఫ్యాన్స్ కి నిరాశే | RCB Vs MI || Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్ హంగామా షురూ కానుంది. ఫ్యాన్స్​ సందడి లేకపోయినా.. చీర్​ గాళ్స్​​ వంపు సొంపుల వయ్యారాలు కనిపించకపోయినా.. బాదుడుకు మాత్రం కొదువలేదన్నట్లుగా సందడి చేసేందుకు ముస్తాబైంది.

కరోనాను పక్కనబెడుతూ.. కావాల్సినంత వినోదాన్ని పంచేందుకు ఐపీఎల్ 2021 సీజన్ మనముందుకు వచ్చేసింది.ఐపీఎల్ అంటేనే గ్లామర్‌కు ఏమాత్రం లోటు ఉండదు. ‌52 రోజుల పాటు సాగే ఈ ధనాధన్ లీగ్‌లో టీవీ తెరలపై మనల్ని అలరించేందుకు స్టార్ స్పోర్ట్స్ హాట్ యాంకర్లు సైతం సిద్దమయ్యారు.

యాంకర్ల జాబితా ఇదే..

యాంకర్ల జాబితా ఇదే..

కరోనా నేపథ్యంలో 6 నగరాలకే పరిమితమైన ఈ ధనాధన్ లీగ్‌ కోసం అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ యాంకర్ల జాబితాను ప్రకటించింది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మళయాళం, బెంగాలీ, మరాఠీ మొత్తం 8 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్న స్టార్ స్పోర్ట్స్.. ఆయా లాంగ్వేజ్‌ల తగిన హోస్ట్‌లను ఎంపిక చేసింది. మొత్తం 21 మందితో కూడా జాబితాను ప్రకటించింది. ఇందులో జస్‌ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేశన్‌తో పాటు కిర నారయణ, నెరోలి మీడోస్‌లు కూడా ఉన్నారు.

తెలుగులో ముగ్గురు..

తెలుగులో ముగ్గురు..

ఇక స్టార్ స్పోర్ట్స్ తెలుగుకు మొత్తం ముగ్గురు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. టాలీవుడ్ హీరో ఆనంద్ కృష్ణతో పాటు యాంకర్లు వింధ్య, నేహా చౌదరీలు తెలుగు హోస్ట్‌లుగా అలరించనున్నారు.

ఇప్పటికే ఈ ముగ్గురు గత సీజన్‌తో పాటు భారత మ్యాచ్‌లకు కూడా హోస్టింగ్ చేశారు. వీరు మ్యాచ్‌కు ముందు తర్వాత, ఇన్నింగ్స్ బ్రేక్‌లో క్రికెట్ నిపుణలతో ఆట గురించి చర్చించనున్నారు. మ్యాచ్‌ అంచనాలతో పాటు ఆటగాళ్ల ప్రదర్శనను మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా విశ్లేషించనున్నారు.

గ్లామ్ డాల్ దూరం..

గ్లామ్ డాల్ దూరం..

ఐపీఎల్ హోస్ట్ అంటే అందరికి మొదటగా గుర్తొచ్చే పేరు గ్లామ్ డాల్ మయంతి లాంగర్. ఆమె కోసం మ్యాచ్‌లు చూసేవారు కూడా ఉన్నారు. ఆకట్టుకునే రూపంతో, తనదైన శైలిలో క్రికెట్ వ్యాఖ్యానం చేసే ఈ బ్యూటీ వ్యాఖ్యాతగా క్రేజీ పాపులారిటీ సంపాదించుకుంది. ప్రీ , పోస్ట్ మ్యాచ్‌ షోలో తనదైన యాంకరింగ్‌తో ఓ రివల్యూషన్ తీసుకొచ్చింది.

మైదానంలో మైక్ పట్టుకొని సీనియర్ క్రికెటర్లతో ఆమె చేసే హడావుడి అంత ఇంతకాదు. అయితే స్టార్ స్పోర్ట్స్ ప్రకటించిన తాజా జాబితాలో ఈ గ్లామ్ డామ్ పేరు లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. క్రికెట్ స్టువర్ట్ బిన్ని సతీమణి అయిన మయంతి గతేడాది ఓ బాబుకు జన్మనిచ్చింది. దాంతోనే గత సీజన్‌కు దూరమైంది. ఈ క్రమంలోనే ఈ సీజన్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు తన బాబు సంరక్షణే ముఖ్యమని స్పష్టం చేసింది. ఇక ప్రసవం తర్వాత ఆమె చాలా బరువు తగ్గింది. అసలు ఆమె రూపమే మారిపోయింది.

స్టార్ స్పోర్ట్స్ హోస్ట్‌లు వీరే..

స్టార్ స్పోర్ట్స్ హోస్ట్‌లు వీరే..

కిరా నారాయణన్, జతిన్ సప్రూ, నెరోలి మీడోస్, అనంత్ త్యాగీ, సురెన్ సుందరమ్, దీరజ్ జునేజా, భావ్నా బాలకృష్ణణ్, నష్‌ప్రీత్ కౌర్, సుహైల్ చందోక్, అనుభవ్ జైన్, రాధకృష్ణణ శ్రీనివాసన్, సంజనా గణేషన్, ముథురామన్, ఆనంద్ కృష్ణ, వింధ్య, నేహా, రీనా , కిరణ్ శ్రీనివాస, మధు, తన్య పురోహిత్

Story first published: Friday, April 9, 2021, 17:44 [IST]
Other articles published on Apr 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+