Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హలో హేటర్స్.. నా మొగుడు అరుదైన ఘనత సాధించాడు: క్రికెట్ బ్యూటీ

 Mayanti Langer hits back at trolls after husband Stuart Binny reaches a new milestone

న్యూఢిల్లీ: సమయం, సందర్భం లేకుండా తన భర్తపై ట్రోలింగ్ దిగే ఆకతాయిలకు క్రికెట్ బ్యూటీ, స్టార్ స్పోర్ట్స్ హోస్ట్ మయాంతి లాంగర్ తనదైనశైలిలో బదులిచ్చింది. ఆకట్టుకునే రూపంతో, తనదైన శైలిలో క్రికెట్ వ్యాఖ్యానం చేసే ఈ బ్యూటీ క్రేజీ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పోర్ట్స్ ప్రజెంటర్, స్టార్ స్పోర్ట్స్ యాంకర్‌గా ప్రీ , పోస్ట్ మ్యాచ్‌ షోలో తనదైన యాంకరింగ్‌తో ఆటలకే ఓ అందం తీసుకొచ్చింది. మైదానంలో మైక్ పట్టుకొని సీనియర్ క్రికెటర్లతో ఆమె చేసే హడావుడి అంత ఇంతకాదు. క్రికెట్ అభిమానులకు మయాంతి అందం, అభినయం సుపరిచితమే. టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ సతీమణి అని, మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కోడలన్న విషయం కూడా తెలిసిందే.

ఒక్క మాట అన్నా..

అప్పుడెప్పుడో 2016లో భారత్ తరఫున వన్డే ఆడిన బిన్నీ మళ్లీ అవకాశం దక్కించుకోలేదు. దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నా.. ఐపీఎల్‌లో కూడా అవకాశం కోల్పోయాడు. గత సీజన్ వేలంలో బిన్నీ అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. ఇక అప్పటి నుంచి ఏదో ఒక విషయంలో స్టువర్ట్ బిన్నీ కొంతమంది ఆకతాయిలు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే బిన్నీని ఒక్క మాట అన్నా.. మయాంతి తనదైన శైలిలో బదులిస్తూ వచ్చింది. మళ్లీ నోరెత్తకుండా చేసింది. ట్రోలర్స్ తగ్గట్లుగానే ట్వీట్స్ చేసింది.

 నా మొగుడు..

నా మొగుడు..

తాజాగా కూడా తన భర్తను ద్వేషించే నెటిజన్లపై మయాంతి తనదైన శైలిలో విరుచుకుపడింది. హలో హేటర్స్ అంటూ.. స్టువర్ట్ బిన్ని సాధించిన ఘనతను వారికి తెలియజేసింది. దేశాళీ క్రికెట్‌లో స్టువర్ట్ బిన్ని 100 లిస్ట్-ఏ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతన్ని కొనియాడిన మయాంతి.. ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే బదులిచ్చింది. 'హలో హేటర్స్.. నా మొగుడు అరుదైన ఘనత సాధించాడు.'అనే క్యాప్షన్‌తో స్టువర్ట్ బిన్నీ ఇన్‌స్టా స్టోరీ స్క్రీన్ షాట్‌ను ట్వీట్ చేసింది. '100 మ్యాచ్‌లు దాని వెనుక బిన్ని 17 ఏళ్ల కష్టం ఉంది. కష్టపడే తత్వం, అతని పట్టుదలే ఇక్కడి వరకు వచ్చేలా చేసాయి. మళ్లీ బిన్ని పేరు చర్చనీయాంశమైంది. ఈ ఘనత సాధించినందుకు అభినందనలు చాంప్'అని ట్వీట్‌లో పేర్కొంది.

 బ్యాగ్‌లు మోస్తున్నాడా..?

బ్యాగ్‌లు మోస్తున్నాడా..?

గతంలో మయాంతి చేసిన ట్వీట్‌కు బదులుగా ఓ నెటిజన్ స్టువర్ట్ బిన్ని ఎక్కడా? అని ప్రశ్నించగా.. మరో నెటిజన్ నీ బ్యాగులు మోస్తున్నాడా? అని వెటకారంగా కామెంట్ చేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మయాంతి అతని దిమ్మతిరిగే బదులిచ్చింది. 'నా బ్యాగ్‌లు నేను మోసుకోగలను. చాలా కృతజ్ఞతలు. అతను క్రికెట్ ఆడుతూ తన జీవితం గడపడంలో బిజీగా ఉన్నాడు. అయితే మీలా తెలియనోళ్లపై అతను కామెంట్స్ చేయకపోవడం నిజంగా అద్భుతమే'అని వ్యంగ్యంగా బదులిచ్చి నోరు మూయించింది.

 బిడ్డకు జన్మనిచ్చి..

బిడ్డకు జన్మనిచ్చి..

ప్రతీ ఐపీఎల్ సీజన్‌లో తనదైన యాంకరింగ్‌తో ఆకట్టుకునే మయాంతి గత కొంతకాలంగా దూరమైంది. పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆమె బ్రేక్ తీసుకుంది. గత సీజన్ ఐపీఎల్ సందర్భంగా తన కుమారిడి ఫొటోను అభిమానులతో పంచుకున్న ఈ క్రికెట్ బ్యూటీ... 'అమ్మతనంలోని నిజమైన ఆనందం ఉంది'అని క్యాప్షన్‌గా పేర్కొంది. అయితే బొద్దుగా ఉండే మయాంతి.. ఈ ఫొటోలో పూర్తిగా సన్నబడటంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. 'అరే బిన్ని.. ఏం చేశావ్ రా?'అంటూ సరదాగా ట్రోలింగ్‌కు దిగారు. ఇక వచ్చే సీజన్‌కు కూడా మయాంతి అందుబాటులో ఉండే అవకాశాలు లేవు.

Story first published: Monday, March 1, 2021, 15:33 [IST]
Other articles published on Mar 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+