ఆ వికెట్‌తో నా భయం పోయింది.. రెండేళ్లు నరకం చూశా: మయాంక్ యాదవ్
ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే వికెట్ దక్కడంతో తన ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందని టీమిండియా పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ తెలిపాడు. రెండేళ్ల తర్వాత రీఎంట్రీ మ్యాచ్‌లోనే మెరుగైన ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ అనుభూతిని వర్ణించేందుకు మాటలు రావడం లేదని పేర్కొన్నాడు.
జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో మయాంక్ యాదవ్(2/18) అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే వికెట్ తీసిన మయాంక్ యాదవ్.. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించాడు. అతని అద్భుత బౌలింగ్‌తో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 125 పరుగులే చేసింది.

మాటలు రావడం లేదు..
ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన మయాంక్ యాదవ్.. తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. 'గాయంతో సుదీర్ఘ కాలం తర్వాత పునరాగమనం చేసిన ఫస్ట్ మ్యాచ్‌లో ఈ తరహా ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అనూభూతిని వివరించేందుకు మాటలు రావడం లేదు.
రెండేళ్ల తర్వాత మళ్లీ భారత్ జట్టు తరఫున ఆడుతుండటంతో కాస్త కంగారుపడ్డా. దేశం కోసం ఆడుతున్నప్పుడు సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఏది ఏమైనా నా బలాలపైనే దృష్టి పెట్టి, సరిగ్గా బౌలింగ్ చేస్తూ ముందుకు సాగాలనుకున్నా.
ఫస్ట్ బాల్‌కే వికెట్ దక్కడంతో..
తొలి బంతికే వికెట్ దక్కడంతో నా ఒత్తిడి చాలా వరకు తగ్గింది. నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. సుదీర్ఘ విరామం తర్వాత ఆడుతున్నప్పటికీ.. నా నైపుణ్యం, బలాలతో మెరుగ్గా రాణించగలననే నమ్మకం కలిగింది. ముఖ్యంగా ఇలాంటి పిచ్‌లు నా బౌలింగ్‌కు సరిగ్గా సూటవుతాయి.
నా పునరాగమనం వెనుక ఎంతో కష్టం ఉంది. శారీరక శిక్షణతో పాటు మానసిక సంసిద్దత వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. రెండేళ్ల నరకం చూశా. ఆటగాడు గాయపడినప్పుడు అతని మానసిక దృడత్వం కీలక పాత్ర పోషిస్తుంది. నా విషయంలో కూడా శారీరకంగా కంటే మానసికంగా ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడు మానసికంగా మరింత బలంగా తయారయ్యాను. సర్జరీ, రిహాబిలిటేషన్ తర్వాత నా శరీరం గురించి నాకు స్పష్టమైన అవగాహన వచ్చింది. అది నాలో చాలా పెద్ద మార్పు తీసుకొచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

