Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అబ్బర బిడ్డో.. ఇన్నింగ్స్ ఫస్ట్‌ బాల్‌కే వికెట్!గంటకు 150 కిలోమీటర్ల వేగం..!(వీడియో)

టీమిండియా యువ పేసర్ మయాంక్ యాదవ్ దుమ్మురేపాడు. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన మయాంక్ యాదవ్.. తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన మయాంక్ యాదవ్.. ఇన్నింగ్స్ ఫస్ట్‌ బాల్‌కే వికెట్ తీసి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.

గంటకు 149 కిలోమీటర్ల వేగంతో వేసిన ఈ బంతికి ప్రత్యర్థి బ్యాటర్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. మయాంక్ యాదవ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

IND vs ENG: టాస్ గెలిచిన భారత్.. SRH ప్లేయర్‌కు నో ఛాన్స్! అశోక్ శర్మ అరంగేట్రం!

IND vs ENG: టాస్ గెలిచిన భారత్.. SRH ప్లేయర్‌కు నో ఛాన్స్! అశోక్ శర్మ అరంగేట్రం!

అసలేం జరిగిందంటే..?

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ వేసిన మయాంక్ యాదవ్.. ఫస్ట్ బాల్‌కే జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్(0)ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. మయాంక్ యాదవ్ వేసిన ఫాస్టెస్ట్ ఆఫ్ స్టంప్ డెలివరీని బెన్నెట్ ఆడలోపే బ్యాట్‌ను ముద్దాడుతూ వికెట్ కీపర్ చేతిలో పడింది. తొలుత అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. భారత్ రివ్యూ ద్వారా ఫలితం రాబట్టింది. ఇషాన్ కిషన్ పట్టుబట్టి మరీ రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి బ్యాట్‌ ఎడ్జ్ అయినట్లు తేలింది. మయాంక్ యాదవ్ ఫాస్టెస్ట్ బాల్‌కు బ్రియాన్ బెన్నెట్ బిత్తరపోయాడు.

Mayank Yadav Dismisses Brian Bennett Off the Very First Ball with 149 KPH Thunderbolt In IND vs ZIM 1st T20I

ఈ వికెట్ ద్వారా మయాంక్ యాదవ్ తనపై విమర్శలకు బదులిచ్చాడు. ఐపీఎల్‌లో కనీసం ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌ను ఎలా ఎంపిక చేస్తారని చాలా మంది సెలెక్టర్లను ప్రశ్నించారు. కానీ అతని పేస్‌పై నమ్మకం ఉంచిన సెలెక్టర్లు జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేశాడు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మయాంక్ యాదవ్ చెలరేగాడు.

భారత టీ20 జట్టులో గందరగోళం.. ఆరుగురు ఆటగాళ్లు దూరం! రింకూతో పాటు నలుగురు కొత్త ఆటగాళ్లకు అవకాశం!

భారత టీ20 జట్టులో గందరగోళం.. ఆరుగురు ఆటగాళ్లు దూరం! రింకూతో పాటు నలుగురు కొత్త ఆటగాళ్లకు అవకాశం!

20 పరుగులకే 3 వికెట్లు..

తన మరుసటి ఓవర్‌లో కూడా వికెట్ తీసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. అతని బౌలింగ్‌లో మేయర్స్ కవర్స్‌లో ఇచ్చిన క్యాచ్‌ను అభిషేక్ శర్మ నేలపాలు చేశాడు. కానీ ఈ బంతి నోబాల్ అని తేలింది. కానీ తన మూడో ఓవర్‌లో మేయర్స్(6)ను మయాంక్ యాదవ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ బెన్ కర్రన్(10)ను ప్రిన్స్ యాదవ్ ఔట్ చేయడంతో జింబాబ్వే 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

Story first published: Thursday, July 23, 2026, 17:16 [IST]
Other articles published on Jul 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+