IND vs ZIM: రఫ్ఫాడించిన మయాంక్ యాదవ్.. చేతులెత్తేసిన జింబాబ్వే!
టీమిండియా పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ రఫ్పాడించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే పతనాన్ని శాసించాడు. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన మయాంక్ యాదవ్ (2/18) రెండు వికెట్లతో తన పునరగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.
మయాంక్ యాదవ్‌కు తోడుగా ఇతర బౌలర్లు రాణించడంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులే చేసింది. వెస్లీ మధెవెరే(34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 39), తడివానషే మరుమాని(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్‌తో పాటు ప్రిన్స్ యాదవ్(2/19) రెండేసి వికెట్లు తీయగా.. శివమ్ దూబే, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.

నిప్పులు చెరిగిన మయాంక్ యాదవ్ ..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకు మయాంక్ యాదవ్ దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే బ్రియాన్ బెన్నెట్(0)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతికి బెన్నెట్ బిత్తరపోయాడు. మరో ఓపెనర్ బెన్ కరన్(10)ను ప్రిన్స్ యాదవ్ క్యాచ్ ఔట్ చేయగా.. డియోన్ మైయర్స్(6)ను మయాంక్ యాదవ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో జింబాబ్వే పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి 26 పరుగులే చేసింది.
జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా(4)ను శివమ్ దూబే ఔట్ చేయగా.. ర్యాన్ బర్ల్(26)ను రవి బిష్ణోయ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో 64 పరుగులకే జింబాబ్వే 5 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగింది. కానీ వెస్లీ మధెవెరే, తడివానషే మరుమాని ఆచితూచి ఆడి జింబాబ్వేను ఆదుకున్నారు. వన్డే తరహా బ్యాటింగ్‌తో వికెట్ల పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆరో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్‌లో శివమ్ దూబే అద్భుతమైన రనౌట్‌తో ఈ భాగస్వామ్యానికి తెరదించాడు. బ్రాడ్ ఇవాన్స్(0)ను ప్రిన్స్ యాదవ్ ఔట్ చేయడంతో జింబాబ్వే 125 పరుగులకే పరిమితమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

