నా ఔట్‌పై స్పందిస్తే నాకే బొక్కా.. ఎందుకు భయ్యా: మయాంక్ అగర్వాల్

సెంచూరియన్: సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్(248 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 122 బ్యాటింగ్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో.. ఆదివారం మొదలైన తొలి టెస్ట్‌లో మొదటి రోజు మొత్తం టీమిండియా ఆధిపత్యం కొనసాగింది. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 90 ఓవర్లలో 3 వికెట్లకు 272 రన్స్ చేసింది.
రాహుల్‌తో పాటు అజింక్యా రహానే(40 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(123 బంతుల్లో 9 ఫోర్లతో 60) ఆకట్టుకోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 4 ఫోర్లతో 35) పర్వాలేదనిపించాడు. అయితే మయాంక్ అగర్వాల్ ఔటైన తీరు చర్చనీయాంశమైంది.

మయాంక్ ఔట్‌పై దుమారం..
లుంగి ఎంగిడి వేసిన 41 ఓవర్ రెండో బంతికి మయాంక్ అగర్వాల్ ఎల్బీగా వెనుదిరిగాడు. ముందుగా అంపైర్ నాటౌట్ ఇవ్వగా సౌతాఫ్రికా రివ్యూకెళ్లి ఫలితం రాబట్టింది. ఎంగిడి వేసిన ఇన్ స్వింగర్ మయాంక్ ప్యాడ్లను తాకింది. అయితే బ్యాట్ ఎడ్జ్ తీసుకొని ప్యాడ్లను తాకినట్లు అనిపించడంతో ఫీల్డ్ అంపైర్ నాటౌటిచ్చాడు. అంతాకాకుండా బంతి బౌన్స్ అయినట్లు అనిపించింది.
టీవీ రీప్లేలో కూడా లెగ్ స్టంప్ టాప్‌ను తాకుతున్నట్లు అనిపించింది. కానీ బాల్ ట్రాకింగ్‌లో మాత్రం బంతి డౌన్ ద లెగ్ స్టంప్‌ను తాకినట్లు తేలడంతో మయాంక్ ఔటయ్యాడు. ఈ బాల్ ట్రాకింగ్‌పై క్రికెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అభిమానులు కూడా అసంతృప్తిని తెలియజేశారు. అంపైర్స్ కాల్ తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు.
నాకే బొక్కా..
ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న మయాంక్ అగర్వాల్ ముందు ప్రస్తావించగా.. సమాధానం చెప్పేందుకు నిరాకరించాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి వివాదంలో చిక్కుకోవడం కంటే నిశబ్దంగా ఉండటమే మంచిదని అభిప్రాయపడ్డాడు. 'ఈ ఔట్ విషయంలో నా అభిప్రాయాన్ని చెప్పేందుకు నాకు అనుమతి లేదు. కాబట్టి సమాధానం చెప్పకుండా వదిలేయాలనుకుంటున్నా. లేకపోతే నేను వివాదంలో చిక్కుకుంటాను. నా మ్యాచ్ ఫీజును కోల్పోతాను'అతని తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు.

రాహుల్‌ను చూసి నేర్చుకోవాలి..
తన ఆడిన ఆట పట్ల మయాంక్ అగర్వాల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. తాము అనుకున్న ప్రణాళికలను అనుకున్నట్టుగా అమలు చేసామని చెప్పాడు. 'క్రమశిక్షణతో బ్యాటింగ్ చేశాం. ఆఫ్ స్టంప్‌కు అవతలగా వచ్చే బంతులను వదిలేయాలని ముందుగానే అనుకున్నాం. మొదట్లో పిచ్‌పై తేమ ఉండడం వల్ల బంతులు బ్యాట్‌కు దూరంగా వచ్చాయి.
కొంత సమయం గడిచిన తర్వాత బంతులు బ్యాట్ మీదకు రావడంతో తొలి రోజు మంచి స్కోర్ చేయగలిగాం. విదేశాల్లో ఆడేటప్పుడు సరైన ప్రణాళిక అవసరం. క్రీజులో ఎలా పాతుకుపోవాలో ఇతర బ్యాటర్లు రాహుల్‌ను చూసి నేర్చుకోవాలి. తన ఆఫ్ స్టంప్ ఎక్కడ ఉందో అతడు బాగా అర్ధం చేసుకోని, బంతులను సరిగ్గా బాదాడు. తన ప్రణాళిక తాను అనుకున్న ప్రకారం క్రమశిక్షణగా అమలు చేసి ఫలితం రాబట్టాడు.'అని మయాంక్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications