Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరుదైన రికార్డు చేరువలో మయాంక్ అగర్వాల్

Mayank Agarwal 36 runs away from surpassing Cheteshwar Pujara and Sunil Gavaskar in elite list

క్రైస్ట్‌చర్చ్: టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరుదైన రికార్డ్‌కు చేరువలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 35, 59 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్.. భారత్ తరఫున ఆ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక శనివారం నుంచి క్రైస్ట్‌చర్చ్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో మరో 36 పరుగులు చేస్తే.. సంప్రదాయక ఫార్మాట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందనున్నాడు.

భారత తరఫున అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగుల మార్క్‌ను అందుకున్న క్రికెటర్ల జాబితాలో వినోద్ కాంబ్లి 14 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. చతేశ్వర్ పుజారా (18 ఇన్నింగ్స్‌లు), సునీల్ గవాస్కర్ (21), మంజ్రేకర్ (23), రాహుల్ ద్రవిడ్ (23), సౌరవ్ గంగూలీ (23) వరుసగా టాప్-6లో కొనసాగుతున్నారు.

ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 10 టెస్టులాడి 15 ఇన్నింగ్స్‌ల్లో 964 పరుగులు చేశాడు. దీంతో రెండో టెస్టులో తొలి లేదా రెండో ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల మార్క్‌ని అందుకుంటే దిగ్గజాల జాబితాలో చేరనున్నాడు.

ఒకవేళ తొలి ఇన్నింగ్స్‌లో ఈ వెయ్యి పరుగుల మార్క్‌ని అందుకుంటే 16 ఇన్నింగ్స్‌లతో పుజారాని వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని అందుకోనున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అందుకున్నా.. 17 ఇన్నింగ్స్‌లతోనూ రెండో స్థానంలో నిలవనున్నాడు. గత ఏడాది నుంచి టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న మయాంక్ అగర్వాల్ 64.27 సగటుతో పరుగులు చేయడం విశేషం.

Story first published: Friday, February 28, 2020, 18:07 [IST]
Other articles published on Feb 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+