Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Matthew Wade: ఆ తప్పిదమే మా కొంపముంచింది!

Matthew Wade: స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఆడలేక ఓటమిపాలయ్యామని ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ అన్నాడు. టీమిండియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటింగ్ వైఫల్యంతో 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన మాథ్యూ వేడ్ మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం కొంపముంచిందన్నాడు. టీ20 ప్రపంచకప్ ముందు ఈ తరహా ఓటములు తమకు ఓ గుణపాఠం లాంటివని తెలిపాడు.

'స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఆడలేకపోయాం. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయాం. మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. కానీ దురదృష్టవశాత్తు బ్యాటింగ్‌లో సత్తా చాటలేకపోయాం. టీ20 ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా టీమ్ ప్రణాళికల్లో ఉన్న ఆటగాళ్లకు ఈ పరాజయం ఓ గుణ పాఠం.'అని మాథ్యూ వేడ్ చెప్పుకొచ్చాడు.

Matthew Wade

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. జితేశ్ శర్మ(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), యశస్వీ జైస్వాల్(28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 37), రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్(3/40) మూడు వికెట్లు తీయగా.. జాసన్ బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆరోన్ హార్డీకి ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 31), మాథ్యూ వేడ్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది.

Story first published: Friday, December 1, 2023, 23:10 [IST]
Other articles published on Dec 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+