IPL 2022: తూ.. దీనమ్మ జీవితం..ఫైనల్‌కు పోయిన ఆనందం కూడా లేదు!

అహ్మదాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో తమ జట్టు ఫైనల్ చేరిందనే ఆనందం కూడా లేదని గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ మాథ్యూ వేడ్ అన్నాడు. ఈ సీజన్‌లో తన వ్యక్తిగత ప్రదర్శన చాలా చిరాకు తెప్పిస్తుందని తెలిపాడు. ఈ సీజన్ లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్.. క్వాలిఫయర్ 1లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఇక ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లోనూ మళ్లీ రాజస్థాన్ రాయల్స్‌తోనే తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మాథ్యూ వేడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో తన పేలవ ప్రదర్శన కారణంగా తమ జట్టు ఫైనల్ చేరిన సంతోషం కూడా లేదన్నాడు.

ఫైనల్ చేరిన సంతోషం లేదు..
'ఈ సీజన్ వ్యక్తిగతంగా నాకు చికాకు తెప్పిస్తోంది. బ్యాటింగ్ సరిగా చేయకపోవడమే అందుకు ప్రధాన కారణం. మంచి షాట్లతో ఇన్నింగ్స్‌ను ఆరంభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నా. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలకమైన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో 35 పరుగులు చేసేంత వరకు నాది చెత్త బ్యాటింగ్ లాగానే కనిపించింది. టీ20 క్రికెట్‌లో దూకుడుగా ఆడితేనే కలిసొస్తుంది. ఆ ప్లాన్‌లో నేను విఫలమయ్యా. కీలకమైన ఫైనల్‌కు ముందు కాస్త మంచి బ్యాటింగ్ చేయడం ఆనందం కలిగించింది.

టైటిల్ మాదే..
ఒక ఆటగాడిగా విఫలమైనప్పుడు కెప్టెన్ మద్దతు ఉండాలి. ఆ విషయంలో హార్దిక్ పాండ్యా నుంచి నాకు మంచి సపోర్ట్ లభించింది. తొలి స్థానం నుంచి ఏడో స్థానం వరకు మా జట్టులో బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. రషీద్ ఖాన్ రూపంలో ఏడో నెంబర్ వరకు విధ్వంసకర బ్యాటింగ్ మాకు ఉండటం అదృష్టం. ఈసారి కప్ గుజరాత్ టైటాన్స్‌దే' అని మాథ్యూ వేడ్ ధీమా వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శనతో తమ జట్టు చాంపియన్‌గా నిలవడంలో ఈ ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్ కీలక పాత్ర పోషించాడు.

11 ఏళ్ల తర్వాత..
దాంతో అతనిపై దృష్టిసారించిన ఐపీఎల్ ఫ్రాంజీలు మెగావేలంలో వేడ్ కోసం పోటీపడ్డాడు. చివరకు గుజరాత్ టైటాన్స్ అతన్ని చేజిక్కించుకుంది.
దాంతో 11 ఏళ్ల తర్వాత మాథ్యూ వేడ్ మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. 2011లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన వేడ్.. ఇప్పటివరకు టీ20 లీగ్‌లో 12 మ్యాచ్‌లు ఆడి 171 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో చేసిన 35 పరుగులే అతని అత్యధిక స్కోరు కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications