For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాలుగో టెస్ట్ కోసం అన్ని విధాల మేం రెడీ: ఆసీస్ క్రికెటర్

Matthew Wade Says Australia Fully Expect To Play 4th Test In Brisbane

సిడ్నీ: టీమిండియాతో నాలుగో టెస్ట్‌ను బ్రిస్బేన్‌ వేదికగా ఆడ‌టానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఆస్ట్రేలియా వికెట్ కీప‌ర్ మాథ్యూ వేడ్ అన్నాడు. క్వారంటైన్ ఉన్నా కూడా త‌మ‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని.. దీనికోసం కొన్ని త్యాగాల‌కు కూడా తాము సిద్ధంగా ఉన్న‌ట్లు స్పష్టం చేశాడు. అయితే టీమిండియా మాత్రం మరోసారి క్వారంటైన్‌కు ససేమిరా అంటుంది. దుబాయ్‌లో, అడిలైడ్‌లో కలిపి మొత్తం 28 రోజులు క్వారంటైన్ ఉన్నామని, మరొకసారి అంటే చాలా కష్టమని తెలిపింది. కానీ ఆసీస్ మాత్రం బ్రిస్బేన్ వేదికగా టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు ఆసీస్ ఏమైనా చేస్తుందని మాథ్యూ వేడ్ పేర్కొన్నాడు.

వాస్తవానికి ఆసీస్‌ టీమ్‌కు బ్రిస్బేన్ వేదిక అచ్చొచ్చిన మైదానం‌. ఇక్క‌డ 1988 నుంచి ఆసీస్‌ ఆడిన ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అందుకే ఆ గ్రౌండ్‌లో మ్యాచ్ జరగాలని తాను కోరుకుంటున్న‌ట్లు వేడ్ స్ప‌ష్టం చేశాడు. అక్క‌డ త‌మ రికార్డు బాగుంద‌ని.. త‌మ‌కు ఆ గ్రౌండ్ అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చాడు. అయితే సిడ్నీలోనే రెండు వ‌రుస టెస్టులు ఆడటానికి తాము సిద్ధంగా లేమ‌ని.. షెడ్యూల్ ప్ర‌కార‌మే బ్రిస్బేన్‌లో ఆడ‌టానికే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం చేశాడు.

క్వీన్స్‌ల్యాండ్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో అక్కడి ప్రభుత్వం క‌ఠిన క్వారంటైన్ నిబంధ‌న‌లను అమలు చేస్తుంది. దీంతో బ్రిస్బేన్‌ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆడడానికి అంగీక‌రించ‌డం లేదు. మరోసారి క్వారంటైన్‌లో ఉండేది లేదని టీమిండియా తేల్చి చెప్పింది. దీంతో నాలుగో టెస్ట్ జ‌రుగుతుందా లేదా అన్న దానిపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే క్రికెట్‌ ఆస్ట్రేలియా మాత్రం ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుందని తెలిపింది. ఒకవేళ టీమిండియా బ్రిస్బేన్‌లో ఆడడానికి ఒప్పుకోకుంటే సిడ్నీలోనే నాలుగో టెస్టును నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

Story first published: Monday, October 18, 2021, 15:32 [IST]
Other articles published on Oct 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+