Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Matthew Wade: మళ్లీ ఆ తప్పిదమే మా కొంపముంచింది!

IND vs AUS: మరోసారి బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన లోస్కోరింగ్ గేమ్‌లో ఆసీస్ పేలవ బ్యాటింగ్‌తో విఫలమైంది.

ఈ పరాజయంతో ఐదు టీ20ల సిరీస్‌ను 1-4తో కోల్పోయింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన మాథ్యూ వేడ్.. ఈ పరాజయం తమకు ఓ గుణపాఠమని తెలిపాడు. 'పిచ్ తగ్గట్లు బౌలింగ్ చేసి భారత్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశాం. ఇది సునాయసంగా చేధించాల్సిన లక్ష్యం. కానీ బ్యాటింగ్ వైఫల్యంతో మరోసారి విజయాన్నందుకోలేకపోయాం.

Matthew Wade reveals the reason Why Australia defeated by India in 5th T20I

బ్యాటింగ్‌లో అప్‌ది ఆర్డర్ రావాలని ఎప్పుడూ ఉంటుంది. కాస్త ముందుగా నేను బ్యాటింగ్ చేయడంపై కూడా చర్చ జరిగింది. కానీ టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా లోయరార్డ్‌లో ఆడటమే నా బాధ్యత. ఈ తరహా పరిస్థితుల్లో జట్టును గట్టెక్కించడం నా రోల్. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే బాగుండేది. కానీ ఈ పరాజయం మాకు ఓ గుణపాఠం. బెన్ మెక్‌డెర్మాట్ అద్భుతంగా పుంజుకున్నాడు. కఠిన పరిస్థితుల్లోనూ బెహ్రెండార్ఫ్, డ్వార్షియుస్, సంఘా ప్రభావం చూపారు. 'అని మాథ్యూ వేడ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31) అతనికి అండగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రాండార్ఫ్, బెన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆరోన్, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసి ఓటమిపాలైంది. బెన్ మెక్‌డెర్మోట్(36 బంతుల్లో 5 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివర్లో మాథ్యూ వేడ్(15 బంతుల్లో 4 ఫోర్లతో 22) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో ముఖేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Sunday, December 3, 2023, 23:07 [IST]
Other articles published on Dec 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+