Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ చేతిలో ఘోర పరాభావం.. తప్పంతా క్రికెట్ ఆస్ట్రేలియాదే: మాథ్యూ హెడెన్

Matthew Hayden slams Cricket Australia for not staging the first Test at The Gabba
India Favourite To Reach World Test Championship Final After Gabba win | IND V ENG | Oneindia Telugu

బ్రిస్బేన్‌: గబ్బా కంచుకోటను అజింక్యా రహానే నేతృత్వంలోని టీమిండియా బద్దలు కొట్టడాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. 1988 నుంచి 32 ఏళ్ల పాటు గబ్బా మైదానంలో ఓటమెరుగని ఆసీస్‌కు టీమిండియా చెక్‌ పెట్టి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘోరపరాభావానికి క్రికెట్ ఆస్ట్రేలియానే కారణమని ఆ దేశ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్‌ అభిప్రాయపడ్డాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్ నిర్వహణ విషయంలో సీఏ సంప్రదాయానికి భిన్నంగా వ్యవహిరించిదన్నాడు. ఎప్పటిలా ఈ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను గబ్బాలోనే మొదలుపెట్టుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నాడు.

గబ్బాలో మొదులుపెడితే..

గబ్బాలో మొదులుపెడితే..

'బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఎప్పుడైనా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగానే ఆరంభం అవుతుంది. కానీ ఈసారి మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా ఆ సంప్రదాయానికి విరుద్దంగా వ్యవహరించింది. ఒక వేళ గబ్బాలో ఫస్ట్ టెస్ట్ జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం మరింత పెరిగేది. ఎందుకుంటే గబ్బా మైదానం ఆసీస్‌కు బాగా కలిసొచ్చేది. 32 ఏళ్ల పాటు అక్కడ మాకు ఓటమి అనేది తెలియదు.

వాకాలో కూడా..

వాకాలో కూడా..

కానీ సీఏ మాత్రం విరుద్ధంగా అడిలైడ్‌ వేదికగా బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌ను ప్రారంభించింది. అంతేగాకుండా టీమిండియా ఎప్పుడు వచ్చినా గబ్బా వేదికగానే తొలి టెస్టు ఆడేది. అలాగే ఈ సిరీస్‌లో పేసర్లకు స్వర్గధామంగా నిలిచే పెర్త్‌(వాకా) మైదానాన్ని కూడా భాగం చేయాల్సింది. వాకాలో ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ అంశమే నన్ను సీఏను తప్పు పట్టేలా చేసింది.'అని హెడెన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 నేనంగీకరించను..

నేనంగీకరించను..

గబ్బాలో ఫస్ట్ మ్యాచ్ నిర్వహించాల్సిందని హెడెన్ వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ కూడా ఏకీభవించాడు. కానీ ఆసీస్ ఓటమికి అదే కారణమంటే మాత్రం తాను ఓప్పుకోనన్నాడు. ఎన్నో ప్రతికూలతల మధ్య భారత జట్టు అద్భుత ప్రదర్శన కనర్చిందని కొనియాడాడు. 'ఎప్పుడైనా బ్రిస్బేన్ వేదికగానే ఫస్ట్ మ్యాచ్ జరగాలి.

కానీ అదే ఆసీస్ ఓటమికి కారణమంటే మాత్రం అంగీకరించను. గబ్బా‌లో ఆడాలంటే ప్రత్యర్థులకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ మైదానం ఎప్పటికీ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు అడ్వాంటేజ్‌గానే ఉంటుంది. అయితే బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత జట్టు పోరాటాన్ని తక్కువ అంచనా వేయలేం. ప్రతికూల పరిస్థితుల్లో ఆ జట్టు అద్భుతంగా పోరాడింది.'అని జాన్సన్ చెప్పుకొచ్చాడు.

అద్భత విజయం..

అద్భత విజయం..

అడిలైడ్ ఘోర పరాజయం.. కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీ.. సీనియర్ ఆటగాళ్లంతా గాయాలతో ఒక్కొక్కరుగా జట్టును వీడినా భారత్ ఈ సిరీస్‌లో అద్భుతంగా పోరాడింది. రహానే సారథ్యంలో సమష్టిగా రాణించి మరిచిపోలేని విజయాన్నందుకుంది. ముందుగా రహానే సూపర్ సెంచరీతో మెల్‌బోర్న్‌లో గెలిచి లెక్కసరిచేసింది. ఆ తర్వాత అశ్విన్- విహారీ విరోచిత ఇన్నింగ్స్‌తో సిడ్నీలో డ్రా చేసుకుంది. ఆఖరి టెస్ట్‌లో యువ ఆటగాళ్లు చెలరేగడంతో ఆసీస్ గబ్బా కోటలను బద్దలు కొట్టి చారిత్రాత్మక విజయాన్నందుకుంది.

Story first published: Thursday, January 21, 2021, 18:27 [IST]
Other articles published on Jan 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+