Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్‌సీబీకి రెండు టైటిళ్లు అందించాడు.. సీఎస్‌కే హెడ్ కోచ్‌గా నియమించండి: మాథ్యూ హేడెన్

టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్‌ను చెన్నైసూపర్ కింగ్స్(సీఎస్‌కే) హెడ్ కోచ్‌గా నియమించాలని ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ సూచించాడు. ఐదు సార్లు ఛాంపియన్‌ అయిన సీఎస్‌కేకు విదేశీ కోచ్‌ల కంటే స్థానిక వ్యక్తులే మెరుగైన సేవలు అందించగలరని మాథ్యూ హేడెన్ అభిప్రాయపడ్డాడు.

చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) హెడ్ కోచ్‌గా 18 ఏళ్ల పాటు సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవలే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అతను ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా.. సీఎస్‌కే నయా హెడ్ కోచ్‌ కోసం అన్వేషణ మొదలుపెట్టింది.

తాజాగా ఈ వ్యవహారంపై మాట్లాడిన మాథ్యూ హేడెన్.. స్టీఫెన్ ఫ్లేమింగ్‌ను తప్పించడం సాహోసోపేతమైన నిర్ణయంగా పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన మాథ్యూ హేడెన్.. దినేష్ కార్తీక్‌కు హెడ్ కోచ్ పదవి బాధ్యతలు ఇవ్వాలని చెప్పాడు. 'సీఎస్‌కే వంటి పెద్ద జట్టుకు విదేశీ కోచ్ కోచ్ కంటే స్థానిక నేపథ్యం ఉన్న కోచ్ మరింత అనుకూలంగా ఉంటారు.

Matthew Hayden Names Dinesh Karthik as Ideal Candidate for CSK Head Coach Role Ahead of IPL 2027

దినేష్ కార్తీక్‌కు చెన్నై క్రికెట్ సంస్కృతి బాగా తెలుసు. కాబట్టి సీఎస్‌కే హెడ్ కోచ్ పదవికి దినేష్ కార్తీక్ సరైన వ్యక్తి. ఐపీఎల్ నుంచి రిటైర్ అయిన తర్వాత దినేశ్ కార్తీక్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి బ్యాటింగ్ కోచ్, కన్సల్టెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఆయన మార్గదర్శకత్వంలో ఆర్‌సీబీ 2025లో తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవడమే కాకుండా ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ టైటిల్ నిలబెట్టుకుంది. సీఎస్‌కే హెడ్ కోచ్ పదవి చేపట్టేందుకు దినేష్ కార్తీక్ సరిగ్గా సరిపోతాడు.'అని మాథ్యూ హేడెన్ చెప్పుకొచ్చాడు. కొత్త కోచ్‌ ఎంపికపై సీఎస్‌కే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రటకన చేయలేదు. కానీ పలువురు మాజీ ఆటగాళ్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఫ్లేమింగ్ పర్యవేక్షణలో ఐదు టైటిళ్లు గెలిచిన సీఎస్‌కే.. గత మూడు సీజన్లలో దారుణంగా విఫలమైంది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయింది. దాంతోనే అతన్ని సీఎస్‌కే తప్పించింది.

Story first published: Monday, August 24, 2026, 16:00 [IST]
Other articles published on Aug 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+