
ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠిపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హెడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. రాహుల్ త్రిపాఠికి అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడే సత్తా ఉందని అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్‌తో మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాహుల్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76) ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన విషయం తెలిసిందే.
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అతను రెచ్చిపోయి ఆడాడు. చివరికి హైదరాబాద్ 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్‌పై స్పందించిన మాథ్యూ హెడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా వంటి పేస్ పిచ్‌లపై అతను అద్భుతంగా రాణించగలడని, టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని పరోక్షంగా సూచించాడు.
మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన హెడెన్.. ఈ వ్యాఖ్యలు చేశాడు. 'రాహుల్ తిప్పాఠి బ్యాటింగ్ చేసే విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. స్టేడియం నలువైపులా షాట్లు ఆడుతూ డేంజరస్ బ్యాటర్‌గా కనిపిస్తున్నాడు. త్వరలోనే అతను టీమిండియాకు ఆడాలని కోరుకుంటున్నా. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగానే బరిలోకి దిగి పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకున్నాడు. విలియమ్సన్ తన స్థానాన్ని కిందకు మార్చుకొని మంచి నిర్ణయం తీసుకున్నాడు.
దాంతో రాహుల్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతని ఆట నన్ను మంత్రముగ్ధుడిని చేసింది. అన్నింటికన్నా ముఖ్యమైనది షార్ట్‌పిచ్ బంతులను అద్భుతంగా ఆడాడు. అతన్ని ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ పిచ్‌లపై ఆడిస్తే కచ్చితంగా క్లిక్ అవుతాడు' అని హెడెన్ చెప్పుకొచ్చాడు. కాగా, మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం రాహుల్ త్రిపాఠిని మెచ్చుకున్నాడు. అతనో ప్రత్యేకమైన ఆటగాడని కొనియాడాడు. ఎప్పుడు బరిలోకి దిగినా మ్యాచ్ గమనాన్ని మార్చేస్తాడని కితాబిచ్చాడు.