Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2025: కమిన్స్ చెత్త కెప్టెన్సే.. ఆసీస్‌ కొంపముంచింది: మాజీ క్రికెటర్లు

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌పై ఆ దేశ దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హెడెన్‌తో పాటు సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ విమర్శలు గుప్పించారు. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ సరిగ్గా లేదన్నారు. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా విజయం ముంగిట నిలిచింది. 282 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 56 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులు చేసింది. ఎయిడెన్‌ మార్క్‌రమ్(159 బంతుల్లో 11 ఫోర్లతో 102 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగితే.. టెంబా బవుమా(121 బంతుల్లో 5 ఫోర్లతో 65 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 143 పరుగులు జోడించారు. సౌతాఫ్రికా విజయానికి 69 పరుగుల అవసరం కాగా.. ఆస్ట్రేలియా గెలవాలంటే 8 వికెట్లు కావాలి.

ఫీల్డ్ సెటప్ సరిగ్గా లేకనే..

అయితే ఈ పరిస్థితికి ప్యాట్ కమిన్స్ చెత్త కెప్టెన్సీ కారణమని డేల్ స్టెయిన్, మాథ్యూ హెడెన్ అన్నారు. అటాకింగ్ ఫీల్డ్ సెటప్ కాకుండా డిఫెన్సివ్ ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకున్నాడని విమర్శించారు. 'ఫీల్డ్ సెటప్ విషయంలో ఆసీస్‌ తప్పిదం చేసింది. అటాకింగ్ ఫీల్డ్ సెటప్ కాకుండా డిఫెన్సివ్ ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. ర్యాన్ రికెల్టన్, మల్డర్‌లను ఔట్ చేసిన తర్వాత బవుమాపై ఆసీస్‌ ఒత్తిడి తేవాల్సింది. ముఖ్యంగా క్యాచింగ్ కవర్ ఏరియాస్‌లో తక్కువ డిఫెన్సివ్‌గా.. మరింత అటాకింగ్‌గా ఫీల్డ్ పెట్టాల్సింది. ఆరంభంలో బంతులు కాస్త పైకి లేచి ఉంటే సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయేది. ఆస్ట్రేలియా మ్యాచ్‌పై పట్టు సాధించేది. కానీ ఆసీస్ పెద్ద పొరపాటు చేసింది.

Matthew Hayden and Dale Steyn Slam Australia Captain Pat Cummins For Huge Tactical Mistake In WTC Final 2025

ఆట స్వభావం మారడం వల్ల స్ట్రైక్ రొటేషన్‌ సులువైంది. భాగస్వామ్యం పెరగడంతో సఫారీ బ్యాటర్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. మరోవైపు ఆసీస్ బౌలింగ్ లైనప్ ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. పిచ్ కండిషన్స్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారాయి. కానీ డబ్ల్యూటీసీ గెలవాలంటే ప్రత్యర్థిని ఆలౌట్ చేయాల్సిందే.'అని మాథ్యూ హెడెన్ చెప్పుకొచ్చాడు.

ఫీల్డింగ్ వైఫల్యంతోనే..

ఆస్ట్రేలియా వ్యూహాలపై డేల్ స్టెయిన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బంతి స్లిప్స్‌లోకి కూడా వెళ్లని పిచ్‌పై మెరుగైన క్యాచింగ్ పొజిషన్స్ పెట్టాల్సిందన్నాడు. 'ఆసీస్ ఫీల్డ్ సెటప్ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆటకు అనుగుణంగా మన వ్యూహాలు మారాలి. ఈ రోజు బంతి ఎక్కువగా బౌన్స్ కాలేదు. స్లిప్ ఫీల్డర్ వైపు బంతి వెళ్లనే లేదు. భారత్ వంటి కండిషన్స్‌లో షార్ట్ కవర్, షార్ట్ మిడ్ వికెట్ ఫీల్డర్స్‌ను పెట్టవచ్చు. కానీ సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి కండిషన్స్‌లో కార్డన్ స్లిప్స్ బెటర్. బంతి వేగంగా వెళ్లని పరిస్థితుల్లో మెరుగైన క్యాచింగ్ పొజిషన్స్‌లో ఫీల్డర్స్‌ను పెట్టాలి.'అని డేల్ స్టేయిన్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Saturday, June 14, 2025, 14:09 [IST]
Other articles published on Jun 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+