For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs SA: 54 ఏళ్లలో ఇదే తొలిసారి!

సౌతాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్‌కే చరిత్ర సృష్టించాడు. 54 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే మరే ఆటగాడు సాధించిన అరుదైన రికార్డ్‌ను అందుకున్నాడు. అరంగేట్రం నుంచి వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో రెండో వన్డేల మాథ్యూ బ్రీట్జ్‌కే 78 బంతుల్లో 88 పరుగులు చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో అతను టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. సిద్దూ కూడా తన కెరీర్‌ను నాలుగు హాఫ్ సెంచరీలతో ప్రారంభించాడు. అయితే అందుకు అతను ఐదు మ్యాచ్‌లు తీసుకున్నాడు. ఇందులో ఒక మ్యాచ్‌లో సిద్దూ బ్యాటింగ్ చేయలేదు.

ఇన్నాళ్లకు మాథ్యూ బ్రీట్జ్‌కే వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో 50 ప్లస్ స్కోర్లు చేశాడు. న్యూజిలాండ్‌తో అరంగేట్ర మ్యాచ్‌లోనే 150(148) సెంచరీ బాదిన బ్రీట్జ్‌కే.. పాకిస్థాన్‌పై(84 బంతుల్లో 83), ఆస్ట్రేలియాపై 56 బంతుల్లో 57, 78 బంతుల్లో 88 పరుగులు చేసి ఈ రికార్డ్ అందుకున్నాడు.

Matthew Breetzke Creates History Becomes First Player to Score 4 Consecutive Fifties in Debut ODIs

ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 84 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్‌కే(78 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 88), ట్రిస్టన్ స్టబ్స్(87 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 74)హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా(3/63) మూడు వికెట్లు తీయగా.. నాథన్ ఎల్లిస్(2/46), మార్నస్ లబుషేన్(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు. జోష్ హజెల్ వుడ్ ఓ వికెట్ తీసాడు.

అనంతరం ఆస్ట్రేలియా 37.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. జోష్ ఇంగ్లీస్(74 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(5/42) ఐదు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్(2/23), సేనరన్ ముత్తుసామీ(2/30) రెండేసి వికెట్లు పడగొట్టాడు.

Story first published: Friday, August 22, 2025, 17:22 [IST]
Other articles published on Aug 22, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+