
వైద్యుల పర్యవేక్షణలో గప్టిల్
టీ20 ప్రపంచకప్ 2021 సూపర్-12లో భాగంగా మంగళవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్టిన్ గప్టిల్ గాయపడ్డాడు. కివీస్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన పాక్ పేసర్ హరీస్ రవూఫ్.. రెండో బంతికే గప్టిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే రవూఫ్ వేసిన బంతి నేరుగా గప్టిల్ కాలికి తగిలి వికెట్లను తాకింది. ఈ క్రమంలో గుప్టిల్ బొటన వేలుకు గాయమైంది.
దీంతో అతడు ఫీల్డింగ్‌కు దిగలేదు. గప్తిల్ గాయంపై న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. 'పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్టిన్ గప్టిల్ బోటన వేలుకు గాయమైంది. గప్టిల్‌ను స్కానింగ్‌కు పంపించాం. గాయంపై 24 నుంచి 48 గంటలు తర్వాత చెబుతాం. గప్టిల్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు' అని పేర్కొన్నాడు.

భారత బౌలర్లకు పండగే
టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా న్యూజిలాండ్ జట్టు మరో కీలకమైన మ్యాచ్‌ను ఆడనుంది. తన రెండో మ్యాచ్‌లో టీమిండియాను ఢీ కొనడానికి సమాయాత్తమౌతోంది. ఆదివారం ఈ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. భారత్, న్యూజిలాండ్ జట్లు తమ తొలి మ్యాచులో ఓటమిపాలయ్యాయి. ఈ రెండు జట్లు కూడా పాక్ చేతిలోనే ఓటమిపాలవ్వడం విశేషం. టోర్నీలో ముందుకు సాగాలంటే.. ఇక నుంచి రెండు జట్లకు ప్రతి మ్యాచ్ కీలకమే కానుంది.
ఈ సమయంలో మార్టిన్ గప్టిల్ గాయం కివీస్ జట్టులో ఆందోళన కలిగిస్తోంది. టీమిండియాతో జరిగే మ్యాచుకు అతడు దూరమైతే కేన్ సేనకు భారీ షాక్ తగలనుంది. ఒకవేళ గప్తిల్ దూరమయితే పాక్ మ్యాచులో దారుణంగా విఫలమయిన భారత బౌలర్లకు పండగే అని చెప్పొచు.
ENG vs BAN: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. సైఫుద్దీన్ ఔట్! ఈ మ్యాచ్ ప్రత్యేకత ఏంటంటే?

హాట్ ఫేవరెట్‌గా పాక్
పాకిస్తాన్ మ్యాచ్ ఆడేందుకు లాకీ ఫెర్గూసన్ స్థానంలో ఆడమ్ మిల్నేని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెక్నికల్ కమిటీ అనుమతించకపోవడంపై తాను నిరాశకు గురయ్యానని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ చెప్పాడు. 'ఈ విషయం మమ్మల్ని నిజంగా నిరుత్సాహపరిచింది. ఎందుకంటే ఆడమ్ మిల్నే ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి. మేము ఐసీసీ నిర్ణయంపై స్పష్టత కోసం ప్రయత్నిస్తాము. మా గ్రూప్‌లో పాకిస్తాన్ ఇప్పుడు హాట్ ఫేవరెట్‌గా ఉంది. మిగిలిన జట్లు తదుపరి స్థానం కోసం పోరాడుతున్నాయి. ఇది టీమిండియా మ్యాచును చాలా క్లిష్టమైనదిగా చేస్తుంది' అని స్టెడ్ పేర్కొన్నాడు.

134 పరుగులకే పరిమితం
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మిషెల్ 20 బంతుల్లో 27 పరుగులు చేయగా.. కాన్వే 24 బంతుల్లో 27 పరుగులు చేశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 25 పరుగులు చేసి నిరాశపరిచాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, ఇమాద్ వసీమ్, మొహ్మద్ హఫీజ్ తలా ఒక వికెట్ తీశారు. స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.


Click it and Unblock the Notifications












