Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs BAN: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లా.. సైఫుద్దీన్ ఔట్! ఈ మ్యాచ్‌ ప్రత్యేకత ఏంటంటే?

ENG vs BAN playing 11 is out: Shoriful Islam in and Saifuddin out for Bangladesh

అబుదాబి: టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా మరికొద్దిసేపట్లో బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. అబుదాబి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా టాస్‌ గెలిచాడు. బ్యాటింగ్‌ చేయడానికి పిచ్‌ సహకరించేలా కనిపిస్తోందని, అందుకే తాము ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంటున్నామని చెప్పాడు. ఇంగ్లండ్ జట్టుకు మంచి టార్గెట్ ఇవ్వాలనుకుంటునట్టు మహ్మదుల్లా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ కోసం బంగ్లా ఒక మార్పు చేసింది. సైఫుద్దీన్ స్థానంలో షోరీఫుల్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

'మాకు ఛేజింగ్‌ రికార్డు బాగానే ఉంది. అబుదాబి వికెట్ చాలా బాగుంది. ఐపీఎల్ 2021 సమయంలో ఇక్కడ మా జట్టులోని కొందరు ప్లేయర్స్ ఆడారు. ఆ అనుభవం ఉపయోగపడనుంది. ఈ మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదు. గతంలోని ఘటనలు మిమ్మల్ని భవిష్యత్తు కోసం ప్రేరేపిస్తాయి. ఈ రోజు మనం ఏమి చేయగలం అనే దానిపై దృష్టిపెట్టాం' అని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. ఇప్పటికే ఆడిన ఓ మ్యాచులో ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది.

అయితే ఈ మ్యాచ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. పొట్టి ఫార్మట్ మ్యాచ్‌లల్లో ఇప్పటిదాకా బంగ్లాదేశ్, ఇంగ్లండ్ రెండు జట్లు ఎప్పుడూ ఎదురు పడలేదు. ఈ రెండు జట్ల మధ్య తొలిసారిగా టీ20 మ్యాచ్ జరుగనుంది. దీనికి టీ20 ప్రపంచకప్ మెగా ఈవెంట్ వేదిక కావడం ఆసక్తిగా మారింది. రెండు దశాబ్దాలుగా బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు టెస్టు, వన్డే ఫార్మాట్లలో మాత్రమే పోటీ పడుతున్నాయి. ఎట్టకేలకు ఈరోజు టీ20 మ్యాచుకు ముహూర్తం కుదిరింది. మరి క్రికెట్ చరిత్రలో తొలిసారి ఈ రెండు జట్లు తలపడే ఈ మ్యాచ్‌లో విజేతగా ఎవరు నిలుస్తారో మరి.

తుది జట్లు:
ఇంగ్లండ్: జేసన్ రాయ్, జోస్ బట్లన్ (వికెట్ కీపర్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, ఇయాన్ మోర్గాన్ (కేప్టెన్), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్.
బంగ్లాదేశ్: మహ్మద్ నయీం, లిట్టన్ దాస్, షకీబుల్ హసన్, ముష్పికుర్ రహీం, మహ్మదుల్లా (కేప్టెన్), అఫిఫ్ హొస్సేన్, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), మెహదీ హసన్, షోరీఫుల్ ఇస్లాం, నాసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.

Story first published: Wednesday, October 27, 2021, 15:40 [IST]
Other articles published on Oct 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+