Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదెక్కడి ఫీల్డింగ్ రా.. మార్నస్ మామ!(వీడియో)

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత విచిత్రమైన ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ 2024-25లో క్వీన్స్‌ల్యాండ్ జట్టుకు సారథ్యం వహిస్తున్న లబుషేన్.. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కనీవినీ ఎరుగని ఫీల్డ్ సెట్ చేశాడు.

ఈ మ్యాచ్‌లో బౌలర్‌గా అవతారమెత్తిన లబుషేన్.. తాను బౌలింగ్ చేసే సమయంలో ప్రధాన అంపైర్ వెనుకాలే ఫీల్డర్‌నిపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇదెక్కడి ఫీల్డింగ్ రా.. మార్నస్ మామ'అంటూ అడుగుతున్నారు.

Marnus Labuschagne Sets Up Unusual Field In Sheffield Shield Game Video Goes Viral

ఈ మ్యాచ్ తొలి రోజు ఆట 66వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ వేసే ముందు తన సహచర ఆటగాడిని పిలిచిన లబుషేన్.. అంపైర్ వెనుకాలే నిల్చోమని చెప్పాడు. ఇది చూసిన ఓ కామెంటేటర్.. 'ఇలాంటి ఫీల్డింగ్ ఎప్పుడూ చూడలేదు'అని పేర్కొన్నాడు. సరిగ్గా అంపైర్ వెనుకాలే నిల్చున్నాడని గుర్తించిన లబుషేన్.. అతన్ని ప్యాంట్‌తో లాగి మరి సరిచేయడం గమనార్హం.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది.కెప్టెన్ సామ్ వైట్‌మన్(102), జోష్ ఇంగ్లీస్(122) సెంచరీలతో రాణించగా.. కూపర్ కొన్నోల్లీ(79), కామెరూన్ గన్నన్(53) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. క్వీన్స్ లాండ్ బౌలర్లలో మిచెల్ నెసర్(5/68) ఐదు వికెట్లు తీయగా.. లబుషేన్(2/5), మ్యాట్ రేన్‌షా(2/43) రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన క్వీన్ లాండ్ 46 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లకు 161 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్(96 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 77) శతకం చేజార్చుకున్నాడు.

Story first published: Wednesday, October 9, 2024, 15:26 [IST]
Other articles published on Oct 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+