Marnus labuschagne: లక్ అంటే నీది.. మార్నస్ మామ! ఒకటి.. రెండు కాదు.. మూడు సార్లు తప్పించుకున్నావ్(వీడియో)

అడిలైడ్: 'అదృష్టం ఉంటే చేయిజారిపోయేది కూడా చేతికి వస్తుంది.'అనే సామెత ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ మామకు సరిగ్గా సరిపోతుంది. అవును.. లక్ ఉంటే లబుషేన్‌లా సెంచరీ బాదొచ్చని కొత్త సామెత చెప్పుకునేలా అతనికి అదృష్టం కలిసి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సార్లు అతనికి అదృష్టం అండగా నిలిచింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరుగుతున్న రెండో టెస్ట్‌లో మార్నస్ లబుషేన్ (305 బంతుల్లో 8 ఫోర్లతో 103) సెంచరీతో చెలరేగాడు.
4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆస్ట్రేలియాను తనదైన జిడ్డు బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(107 బంతుల్లో 11 ఫోర్లతో 95)తో కలిసి రెండో వికెట్‌కు 172 పరుగులు జోడించిన లబుషేన్.. స్టీవ్ స్మిత్‌తో కలిసి మూడో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం అందించాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ఆసీస్ పటిష్ట స్థితిలో నిలిచింది.
ఈ క్రమంలోనే జేమ్స్ అండర్సన్ వేసిన 94 ఓవర్ మూడో బంతిని బౌండరీ బాదిన లబుషేన్.. యాషెస్‌లో తొలి సెంచరీ అందుకున్నాడు. ఓవరాల్‌గా అతనికిది ఆరో సెంచరీ. అయితే ఈ సెంచరీ అందుకోవడానికి లబుషేన్‌కు మూడు సార్లు అదృష్టం కలిసి వచ్చింది. తొలి రోజు ఆటలో హాఫ్ సెంచరీ ముంగిటే..34.3 ఓవర్‌లో లబుషేన్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ బెన్ స్టోక్స్ నేలపాలు చేశాడు. సునాయసంగా అందుకోవాల్సిన క్యాచ్‌ను చేజార్చాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్ కీలకమైన లబుషేన్.. రెండో రోజు ఆట ముగింపు పలికే ముందు జేమ్స్ అండర్స్ వేసిన 84.4 ఓవర్‌లో ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వికెట్ కీపర్ జోస్ బట్లర్ నేలపాలు చేశాడు.
ఇక రెండో రోజు ఆట ప్రారంభంలో ఓలీ రాబిన్సన్ వేసిన 95.1 ఓవర్‌లో లబుషేన్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. థర్డ్ అంపైర్ క్రాస్ చెక్ చేయడంతో అది నో బాల్‌గా తేలింది. మిల్లీమీటర్ తేడాలో రాబిన్సన్ పాదం లైన్ క్రాస్ అయ్యింది. దాంతో అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. దాంతో క్రీజును దాటిన లబుషేన్ నవ్వుతూ.. మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. దాంతో అభిమానులంతా లక్ అంటే నీది మార్నస్ మామ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక లైఫ్‌లతో గోడలా నిలిచిన లబుషేన్‌ను రాబిన్సనే పెవిలియన్ చేర్చాడు. ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. లబుషేన్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. క్రీజులోకి ట్రావిస్ హెడ్(6 బ్యాటింగ్) రాగా.. స్మిత్(31 బ్యాటింగ్) మరో వికెట్ పడుకుండా జాగ్రత్త పడ్డాడు. దాంతో ఆసీస్ 251/3తో డ్రింక్స్ బ్రేక్‌కు వెళ్లింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications