అనయ బంగర్‌ను మహిళల క్రికెట్‌లోకి అనుమతించొద్దు: సౌతాఫ్రికా దిగ్గజం
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూతురు అనయ బంగర్‌ను మహిళల క్రికెట్‌లోకి అనుమతించడాన్ని సౌతాఫ్రికా దిగ్గజం మరజన్నే కాప్ తప్పుబట్టింది. ట్రాన్స్‌జెండర్లను మహిళల క్రికెట్‌లోకి అనుమతించొద్దని అభిప్రాయపడింది.
అబ్బాయిగా పుట్టిన అనయ బంగర్ లింగమార్పిడి సర్జరీతో అమ్మాయిగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ఆమెకు సర్జరీ జరగ్గా.. మళ్లీ క్రికెట్‌లో పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే అనయ్ బంగర్‌కు ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌లో ఆడేందుకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియానే ఓ ప్రకటనలో వెల్లడించింది. దాంతో వచ్చే ఏడాది మార్చిలో జరిగే బీబీఎల్ మహిళల లీగ్ పాల్గొనేందుకు అనయ్ బంగర్‌కు మార్గం సుగుమమైంది.
ఇది హాస్యాస్పదం..
అయితే ఈ నిర్ణయాన్ని మరజన్నే కాప్ తప్పుబట్టింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయాన్ని తప్పుబడుతూ ఓ స్టోరీని షేర్ చేసింది. అనయ బంగర్ బీబీఎల్ ఆడనుందనే వార్తకు సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ట్రాన్స్‌జెండర్లను మహిళల క్రికెట్‌లోకి అనుమతించవద్దని డిమాండ్ చేసింది. 'ఇది పూర్తిగా హాస్యాస్పదం. ట్రాన్స్‌జెండర్లను మహిళా క్రికెట్‌లోకి అనుమతించకూడదు" అని మరిజన్నే కాప్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

మరోవైపు బీబీఎల్ ఆడే అవకాశం రావడంపై అనయ బంగర్ సంతోషం వ్యక్తం చేసింది. 'మార్చి 2027 నుంచి డబ్ల్యూబీబీఎల్‌లో ఆడేందుకు అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక దశలో క్రికెట్ నుంచి శాశ్వతంగా దూరమయ్యానని నేను భావించాను' అని తెలిపింది.
ప్రస్తుతానికి క్రికెట్ ఆస్ట్రేలియా ఇచ్చిన ఈ అనుమతి తొలి అడుగు మాత్రమేనని, తన ఫిట్‌నెస్‌ను తిరిగి సాధించడంపైనే పూర్తి దృష్టి పెడతానని వెల్లడించింది. క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ ఆసీస్ గడ్డపై అనయ తన క్రికెట్ ప్రయాణాన్ని పునఃప్రారంభించనుంది.
ఐసీసీ రూల్స్ విరుద్దంగా ఉన్నా..
ఆస్ట్రేలియా క్రికెట్ నిబంధనల ప్రకారం అనయ బంగర్‌కు అనుమతి లభించింది. ఎలైట్ మహిళా కేటగిరీలో ఆడాలంటే కనీసం 12 నెలల పాటు సీరమ్ టెస్టోస్టెరాన్ సాంద్రతను 10 నానోమోల్స్ కంటే తక్కువగా నిర్వహించాల్సి ఉంటుంది. అనయ సమర్పించిన వైద్య నిపుణుల సమాచారాన్ని పరిశీలించిన సీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ధృవీకరించింది.
సీఏ నిర్ణయంతో అనయ ఆస్ట్రేలియాలోని ఏ రాష్ట్రంలోనైనా జరిగే ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్లు, మహిళా బిగ్ బాష్ లీగ్ (WBBL) లో ఆడేందుకు మార్గం సుగమమైంది. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ట్రాన్స్‌జెండర్స్‌కు అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అనుమతి లేదు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా దేశవాళీ పాలసీ నిబంధనలు విభిన్నంగా ఉండటం అనయ బంగర్‌కు కలిసొచ్చింది.
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్, కశ్మీరా దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. రెండో అబ్బాయి పేరు ఆర్యన్. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆర్యన్ అండర్ -16, అండర్ -19 విభాగాల్లో క్రికెట్ ఆడాడు. ఆర్యన్‌కు ప్రముఖ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, అతని సోదరుడు ముషీర్ ఖాన్‌తో కలిసి ఆడిన అనుభవం ఉంది. అయితే, జెండర్-అఫర్మింగ్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఆర్యన్ కాస్త అనయగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

