ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా కోల్‌కతా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా 170 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సౌతాఫ్రికాను మార్కో యాన్సెన్(30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు.
ట్రిస్టన్ స్టబ్స్(24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29)తో కలిసి 6వ వికెట్‌కు 73 పరుగులు జోడించాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్(27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(2/34), కోల్ మెక్‌కాంచీ(2/9), రచిన్ రవీంద్ర(2/29) రెండేసి వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. కోల్ మెక్‌కాంచీ వేసిన రెండో ఓవర్‌లో ఓపెనర్ క్వింటన్ డికాక్(10), ర్యాన్ రికెల్టన్(0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో సౌతాఫ్రికా పరుగుల వేగం తగ్గింది. దాంతో పవర్ ప్లేలో సౌతాఫ్రికా 2 వికెట్లకు 48 పరుగులే చేసింది. ఆచితూచి ఆడిన మార్క్‌రమ్(18)ను రచిన్ రవీంద్ర క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్‌లో డేంజరస్ డేవిడ్ మిల్లర్(6)ను క్యాచ్ ఔట్ చేయగా.. దూకుడుగా ఆడిన బ్రేవిస్(34)ను నీషమ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో యాన్సెన్, స్టబ్స్ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. స్టబ్స్ నిదానంగా ఆడిన యాన్సెన్ చెలరేగాడు. బౌండరీల మోత మోగించాడు. స్టబ్స్(39)ను ఫెర్గూసన్ పెవిలియన్ చేర్చినా.. యాన్సెన్ వెనక్కి తగ్గలేదు. ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాది 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి ఓవర్‌ను మ్యాట్ హెన్రీ కట్టడిగా బౌలింగ్ చేసి 6 పరుగులే ఇవ్వడంతో న్యూజిలాండ్ 169 పరుగులే చేయగలిగింది.