Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ సాధించిన ఆ చారిత్రక విజయానికి 20 ఏళ్లు!

March 22, 2001: On this day Sourav Ganguly-led India defied invincible Australians to register watershed series win

హైదరాబాద్: సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే రోజు( 2001, మార్చి22) టెస్ట్ క్రికెట్‌లో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న ఆస్ట్రేలియా జట్టును మట్టికరిపించింది. ఇప్పడంటే కంగారులపై అలవోకగా గెలుస్తున్నప్పటికీ.. రెండు దశాబ్దాల క్రితం ఆ జట్టు చాలా భీకరంగా ఉండేది. ముఖ్యంగా స్టీవ్ వా నేతృత్వంలోని ఆ జట్టు ప్రత్యర్థులతో పనిలేకుండా విజయాలు సాధించేది. అలా వరుసగా 16 టెస్టులు గెలుస్తూ వచ్చిన కంగారూలను చివరికి సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టు గడగడలాడించింది. యువ స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్ తన గూగ్లీలతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. మూడు టెస్టుల్లో 32 వికెట్లు తీసి చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా 2-1 తేడాతో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది.

 ఫస్ట్ మ్యాచ్ ఆసీస్‌దే

ఫస్ట్ మ్యాచ్ ఆసీస్‌దే

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ముంబై వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ అలవోకంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 176 పరుగులకే ఆలౌటవ్వగా.. ఆస్ట్రేలియా మాత్రం 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టులో మాథ్యూ హెడెన్‌(119), గిల్‌క్రిస్ట్‌(122) సెంచరీలతో చెలరేగారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 219 పరుగులకే కుప్పకూలింది. దాంతో కంగారులు మిగతా 47 పరుగులు లక్ష్యాన్ని చేధించి 10 వికెట్లతో ఘన విజయం సాధించారు. దాంతో సిరీస్‌లో బోణీ కొట్టి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ మ్యాచ్‌లో హర్భజన్‌ సింగ్ నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు.

 చరిత్రలో నిలిచిపోయిన ఇన్నింగ్స్..

చరిత్రలో నిలిచిపోయిన ఇన్నింగ్స్..

ఫస్ట్ టెస్ట్ ఘోర పరాభవంతో సెకండ్ టెస్టుకు రెడీ అయిన టీమిండియా ఇక్కడా కూడా పేలవంగా ఆరంభించింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకొని కోల్‌కతాలోని ఈడెన్‌ మైదానంలో చారిత్రక విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేయగా.. టీమిండియా 171 పరుగులకే ఆలౌటైంది. దాంతో మరో భారీ ఓటమి తప్పదని అంతా భావించారు. కానీ, ఫాలోఆన్‌ ఆడిన టీమింయా అద్భుతం చేసింది. వీవీఎస్ లక్ష్మణ్‌(281), రాహుల్ ద్రవిడ్‌(180) అసాధారణ పోరాటంతో రెండో ఇన్నింగ్స్‌లో 657/7 పరుగుల భారీ స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఆపై ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో హర్భజన్‌ సింగ్ హ్యాట్రిక్‌ వికెట్లు తీయడంతో 212 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతోనే ఆ జట్టు 16 టెస్టుల జైత్రయాత్రకు టీమిండియా బ్రేకులు వేసింది. ఈ మ్యాచ్‌లో భజ్జీ మొత్తం 13 వికెట్లు తీయడం విశేషం.

 చెలరేగిన భజ్జీ..

చెలరేగిన భజ్జీ..

ఇక చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా హోరాహోరీగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ హెడెన్‌(203) డబుల్ సెంచరీ సాధించాడు. ఆపై సచిన్‌(126) సెంచరీకి ఇతర బ్యాట్స్‌మన్‌ రాణించడంతో టీమిండియా 501 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 264 పరుగులకు ఆలౌటైంది. చివరికి టీమిండియా ఎనిమిది వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసి విజయాన్నందుకుంది. దాంతో భారత్‌ 3-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హర్భజన్‌ సింగ్ ఒక్కడే 15 వికెట్లు తీయడం విశేషం. ఈ సిరీస్ భజ్జీ మొత్తం 32 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. హర్భజన్ దెబ్బ నుంచి తేరుకునేందుకు ఆసీస్‌కు కొన్నాళ్లు పట్టింది.

Story first published: Monday, March 22, 2021, 15:46 [IST]
Other articles published on Mar 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+