For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

March 18: భారత క్రికెట్ చరిత్రలోనే మరిచిపోలేని రోజు!

 March 18: On this day Dinesh Karthiks last-ball six seals Nidahas Trophy

హైదరాబాద్: మార్చి 18 భారత క్రికెట్ చరిత్రలోనే మరిచిపోలేని రోజు! ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు ఘటనలు భారత అభిమానులను కనువిందు చేశాయి. ఒకటి ఉత్కంఠకే ఊపిరి అందనివ్వని సందర్భం అయితే మరొకటి మనస్సును తేలిక పరిచేది. ఇంకొకటి కాస్త బాధను మిగిల్చిన ఘటన!

సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజు ఓ క్రికెట్ శిఖరం తన ఆట‌కు వీడ్కోలు పలకగా.. అదే మ్యాచ్‌లో ఓ యువ ఆటగాడు తన సత్తాను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఐదేళ్ల క్రితం మళ్లీ ఇదే రోజు ఓ స్టార్ ప్లేయర్ మరిచిపోలేని విజయాన్ని అందించాడు. ఆ క్రికెట్ శిఖరం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అయితే.. ఆ యువ కెరటం విరాట్ కోహ్లీ(Virat Kohli).! ఇక ఆ మధురానుభూతిని అందించింది మాత్రం దినేష్ కార్తీక్ (Dinesh Karthik).!

11 ఏళ్ల క్రితం( 2012 మార్చి 18) ఇదే రోజు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో చివరి వన్డే ఆడాడు. ఆసియాకప్‌ 2012లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాక్ నిర్ధేశించిన 330 పరుగుల లక్ష్యాన్ని భారత్ 13 బంతులు మిగిలుండగానే చేధించింది. తన ఆఖరి వన్డేలో సచిన్(52) హాఫ్ సెంచరీతో రాణించగా.. యువ కెరటం విరాట్ కోహ్లీ (183) పరుగుల విధ్వంసం సృష్టించాడు. అప్పుడప్పుడే కెరీర్ ప్రారంభించిన విరాట్.. ఈ ఇన్నింగ్స్‌తో తాను ఎంతటి భయంకరమైన ఆటగాడినో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇక ఈ టోర్నీలోనే సచిన్ బంగ్లాదేశ్‌పై శతకం చేసి 100 సెంచరీలను పూర్తి చేసుకున్నాడు.

2018 మార్చి 18.. బంగ్లాదేశ్‌తో నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ సెన్సేషనల్ నాక్‌తో ఓటమి నుంచి విజయాన్నందించాడు. రోహిత్ సేన గెలవాలంటే ఆఖరి బంతికి 5 పరుగులు కావాలి. క్రీజులో దినేశ్ కార్తీక్.. బౌలర్‌గా సౌమ్యా సర్కార్. ఉత్కంఠకే ఊపిరందని క్షణం. విజయం ఎవరినో వరిస్తుందో తెలియని సందర్భం. ఈ క్లిష్ట స్థితిలో తన అనుభవాన్నంత రంగరించిన దినేశ్ కార్తీక్ అద్భుత సిక్సర్ కొట్టాడు.

ఒక్కసారిగా భారత శిభిరంలో ఆనందం.. ఆ క్షణం యావత్ భారతానికి దినేశ్ కార్తీక్‌ హీరో అయ్యాడు. ఈ ఒక్క సిక్స్ తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో రాని గుర్తింపును కార్తీక్‌కు తెచ్చిపెట్టింది. ఈ మ్యాచ్‌లో కార్తీక్ 8 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ పెర్ఫామెన్స్ అతన్ని 2019 వన్డే వరల్డ్‌కప్ టీమ్‌లోకి తీసుకునేలా చేసింది.

Story first published: Saturday, March 18, 2023, 16:44 [IST]
Other articles published on Mar 18, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+