కేఎల్ రాహుల్‌పై వేటు వేసి ఆ కుర్రాడిని తీసుకోండి: టీమిండియా మాజీ క్రికెటర్
న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై వేటు వేయాలని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్నాడు. అతని స్థానంలో దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న యువ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేయాలని భారత సెలెక్టర్లకు ఈ బెంగాల్ క్రికెటర్ సూచించాడు.
సెంచరీతో సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టులో కొనసాగించాలని చెప్పిన మనోజ్ తీవారీ.. రాహుల్ గణంకాలు టెస్ట్‌ల్లో అంత గొప్పగా లేవన్నాడు. అతని కంటే మెరుగ్గా రాణించే ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో చాలా మంది ఉన్నారని, వారికి అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.

'టెస్ట్ ఫార్మాట్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించి అతని నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టారు. అతనికి వరుసగా అవకాశాలు ఇవ్వాలి. అయితే ఇలానే దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న అభిమన్యు ఈశ్వరన్‌ను కూడా భారత జట్టుకు ఎంపిక చేయాలి. అతను స్పెషలిస్ట్ ఓపెనరే. కానీ ఇటీవల ఆడిన మ్యాచ్‌ల్లో అతను సెంచరీ చేయకుండా ఒక్క మ్యాచ్ లేదు.

కాబట్టి అతనికి మిడిలార్డర్‌లో అవకాశం ఇవ్వాలి. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఏ స్థానంలోనైనా రాణించగలడు. అప్‌కమింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం కేఎల్ రాహుల్‌ను సిద్దం చేస్తున్నారనే విషయం తెలుసు. అతను అనుభవం కలిగిన బ్యాటర్‌తో పాటు నైపుణ్యం కలిగిన ఆటగాడు. కానీ అతనిలో నిలకడ లోపించింది. నిలకడగా రాణించలేనప్పుడు ఎంత టాలెంట్ ఉండి ఏం లాభం. రాహుల్ విషయంలో సెలెక్టర్ల పునరాలోచన చేయాలి.'అని మనోజ్ తీవారి చెప్పుకొచ్చాడు.
దేశవాళీ క్రికెట్‌లో అభిమన్యు ఈశ్వరన్ గత 6 ఇన్నింగ్స్‌ల్లో 4 శతకాలు నమోదు చేశాడు. ఇరానీ కప్‌లో ముంబైపై రెస్టాఫ్ ఇండియా తరఫున 191 పరుగులు చేశాడు. దులీప్ ట్రోఫీలో ఇండియా బీ తరఫున 157 పరుగులతో రాణించాడు.

మరోవైపు కేఎల్ రాహుల్.. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో 12 పరుగులే చేసి వెనుదిరిగాడు. రాహుల్ వైఫల్యం టీమిండియా ఓటమికి కారణమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు ఆలౌటైన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 462 రన్స్ చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసి 356 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకున్న న్యూజిలాండ్.. భారత్ విధించిన 107 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధించే దిశగా సాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications