ఆ పెద్ద ఏనుగును వదిలేసి అయ్యర్‌ను బలిపశువును చేస్తారు: మనోజ్ తివారి
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను లక్ష్యంగా చేసుకొని మాజీ క్రికెటర్ మనోజ్ తివారి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఐర్లాండ్ చేతిలో టీమిండియాకు ఎదురైన ఘోర పరాజయానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించాడు. ఈ ఓటమికి బాధ్యులైన వారి గురించి ఎవరూ మాట్లాడటం లేదని, శ్రేయస్ అయ్యర్‌ను బలిపశువు చేసే కుట్ర జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. వైభవ్ సూర్యవంశీ ఇంకెన్నాళ్లు వేచి చూడాలని నిలదీసాడు.
ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో టీమిండియా 0-2తో క్లీప్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. పేలవ బ్యాటింగ్‌తో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకుండా సీనియర్లను ఆడించగా.. వారు దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

పెద్ద ఏనుగు గురించి మాట్లాడరేం..?
ఈ క్రమంలోనే మాట్లాడిన మనోజ్ తివారీ గంభీర్ పేరును ప్రస్తావించకుండా పెద్ద ఏనుగు అంటూ విమర్శలు గుప్పించాడు. 'భారత్ సౌతాఫ్రికాలో వరల్డ్ కప్ గెలవవచ్చు. ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ను కూడా భారత్ గెలవవచ్చు. కానీ ఐర్లాండ్‌తో ఓడిపోయిన టీ20 సిరీస్ సంగతి ఏంటి? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? జట్టులోని ఆ పెద్ద ఏనుగు గురించి మాట్లాడమని చెప్పాను. కానీ నా మాటలను ఎవరూ పట్టించుకోలేదు.
పీఆర్ ఏజెన్సీలు, నిర్ణయాలు తీసుకునే వ్యక్తి యొక్క స్నేహితులు ఈ ఓటమికి శ్రేయస్ అయ్యర్‌ను నిందించడం ప్రారంభిస్తారని నాకు తెలుసు. తొలి మ్యాచ్ నుంచే వైభవ్ సూర్యవంశీని తుది జట్టులో ఎందుకు ఆడించలేదు? అతనికి అవకాశం ఇవ్వలేకపోవడానికి టీమిండియా అసిస్టెంట్ కోచ్ ఒకరు ఓ లాజిక్ చెప్పారు. 15 ఏళ్ల కుర్రాడి కోసం బాగా ఆడే ప్లేయర్లను ఎలా పక్కనపెట్టగలం? అని వ్యాఖ్యానించారు. కానీ, ఇక్కడ ఓ విషయం మీరు గమనించాలి.
ఇంకెన్నాళ్లు వేచి చూడాలి..
వైభవ్ అద్భుతమైన ఫామ్‌తో తన అవకాశం కోసం వేచి ఉన్నాడు. ఐపీఎల్ ముందు జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ఆటగాళ్ల గురించి మాట్లాడుతున్నారు. మరోవైపు పార్ట్‌టైమ్ ఆటగాడు(సుందర్) మీ అంచనాలను అందుకోలేకపోయాడు. అందుకే మీరు అతన్ని కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడించారు. మరి వైభవ్ సూర్యవంశీ ఇంకెంత కాలం వేచి చూడాలి?' అని తివారీ ఎక్స్‌వేదికగా ఓ వీడియోను పంచుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
" width="200" height="113">