
కర్మ ఎప్పటికైనా తిరిగి మన వద్దకే చేరుతుంది
కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఖండిస్తుండగా.. మరికొందరు ఆమెకు మద్దతునిస్తున్నారు. తాజాగా ఆమెకు మద్దతు పలికే వారిలో టీమిండియా బ్యాట్స్‌మన్ మనోజ్ తివారి కూడా చేరిపోయాడు. ట్విటర్ వేదికగా కంగనాకు ఆయన మద్దతు నిచ్చాడు. బుధవారం ట్వీట్ చేస్తూ.. భారతదేశం సుశాంత్ మృతికి కారణం తెలుసుకోవానుకుంటోందని పేర్కొన్నాడు. 'సుశాంత్ మృతిపై కంగనా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రతి ఒక్కరూ ఆమెపై దాడి చేస్తున్నారు. అయితే అందరూ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనం చేసిన కర్మ ఎప్పటికైనా తిరిగి మన వద్దకే చేరుతుంది' అంటూ #IndiaWantsSushantTruth అనే హ్యష్ ట్యాగ్‌ను జత చేశాడు.

కంగనా పోరాటం కొనసాగించాలి
మనోజ్ తివారి మరో ట్వీట్ కూడా చేశాడు. 'తనపై దాడి చేసే వారిపై కంగనా రనౌత్ పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది. ఇతర విషయాలపైకి మళ్ళకుండా కంగనా ఇలాగే పోరాటం కొనసాగించాలని ఆశిస్తున్నా. కంగనా దీనిపై నోరు విప్పినందుకే ఆమెపై దాడులు జరుగుతున్నాయి. ఆమెకు మద్దతు ఇవ్వకపోతే వారు నోరు మూసుకోలేరు' అంటూ ట్వీట్లో తివారి రాసుకొచ్చాడు. అంతకు ముందు కూడా సుశాంత్ ఫొటోని షేర్ చేస్తూ... 'చివరికి శత్రువు మాటలను కాదు, స్నేహితుల నిశ్శబ్దాన్ని గుర్తుంచుకుంటాం' అంటూ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిన మాటలను పోస్ట్ చేశాడు.

బాలీవుడ్లో వివక్ష చాలా ఉంది
ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ మాట్లాడుతూ... బాలీవుడ్ పెద్దల పేర్లు చెప్పడంతో పాటు వారిని 'మూవీ మాఫియా'గా అభివర్ణించారు. సుశాంత్ మృతికి ఆ మాఫియానే కారణమని ఆరోపించారు. 'బాలీవుడ్లో వివక్ష చాలా ఉంది. అందుకే సినిమా పరిశ్రమలోని కొందరు పెద్దలు నా కెరీర్, ఆర్థిక వనరులను లక్ష్యంగా చేసుకున్నారు. నన్ను ఒంటరిని చేయాలని ప్రయత్నించారు. మూవీ మాఫియానే సుశాంత్ కెరీర్‌ను నాశనం చేసింది. సుశాంత్ మానసిక క్షోభకు యశ్‌రాజ్ ఫిల్మ్స్ బాధ్యత వహించాలి' అని కంగనా డిమాండ్ చేశారు.
టీ20ల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ బ్రాడ్.. ఆ తర్వాత దూబేనే!!


Click it and Unblock the Notifications
