For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాంటింగ్ పిచ్చి ప్రయోగాలే పంజాబ్ కొంపముంచుతున్నాయి: మాజీ క్రికెటర్

పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాంటింగ్ తన పిచ్చి ప్రయోగాలు ఆపకపోతే పంజాబ్ కింగ్స్‌ ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటి బాట పడుతుందని హెచ్చరించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిలకడగా రాణిస్తోంది. అయితే హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పదే పదే తుది జట్టులో మార్పులు చేస్తున్నాడు.

వరుసగా విఫలమవుతున్న గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు అవకాశాలు ఇస్తున్నాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసిన శశాంక్ సింగ్, నెహాల్ వధేర కంటే మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాడు. కేకేఆర్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు 120 పరుగుల శుభారంభం అందించిన తర్వాత ఫామ్‌లో ఉన్న నెహాల్ వధేర, శశాంక్ సింగ్‌లను కాకుండా గ్లేన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీస్, మార్కో జాన్సెన్‌లను అప్‌ది ఆర్డర్ పంపించాడు. ఈ ముగ్గురు దారుణంగా విఫలమవడంతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న పంజాబ్ 201 పరుగులకే పరిమితమైంది.

Manoj Tiwari Says PBKS Can t Win IPL 2025 Because Ricky Ponting bizarre experiments

పంజాబ్ టైటిల్ గెలవదు..
పాంటింగ్ ప్రయోగాలను తప్పుబట్టిన మనోజ్ తివారి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ టైటిల్ గెలవదని నాకు బలంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ జట్టు కోచ్ ఫామ్‌లో ఉన్న భారత బ్యాటర్లు నెహాల్ వధేర, శశాంక్ సింగ్‌లను బ్యాటింగ్ పంపించకుండా..విదేశీ ఆటగాళ్లను అప్‌ది ఆర్డర్ ఆడించాడు. విదేశీ ఆటగాళ్లనే ఎక్కువగా నమ్ముతున్నాడు. వాళ్లు దారుణంగా విఫలమవుతున్నారు. భారత ఆటగాళ్లపై పాంటింగ్ నమ్మకం ఉంచడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే.. వాళ్లు టాప్-2లో నిలిచినా టైటిల్ గెలవలేరు.'అని తివారి ఎక్స్‌ వేదికగా హెచ్చరించాడు.

వర్షార్పణం..
ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌ వర్షార్పణమైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్(49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 83), ప్రియాంశ్ ఆర్య(35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా(2/34) రెండు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, ఆండ్రీ రస్సెల్‌లకు చెరో వికెట్ దక్కింది. అనంతరం కేకేఆర్ తొలి ఓవర్‌లో 7 పరుగులు చేసింది. ఆ సమయంలోనే వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. భారీ గాలులతో వర్ష పడటంతో మైదానంలో కవర్లు ఏర్పాటు చేయడం కూడా కష్టమైంది. వర్షం తగ్గకపోవడంతో ఆటను రద్దు చేసిన అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.

Story first published: Sunday, April 27, 2025, 10:09 [IST]
Other articles published on Apr 27, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+