సంజూ శాంసన్‌లానే అవకాశాలు ఇవ్వకుండా నా కెరీర్ నాశనం చేశారు: మనీశ్ పాండే

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌లానే తనకు అవకాశాలు ఇవ్వకుండా అన్యాయం చేశారని వెటరన్ బ్యాటర్ మనీశ్ పాండే అన్నాడు. పదే పదే రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టడంతో తాను మానసికంగా బలహీనమయ్యానని చెప్పుకొచ్చాడు. దాంతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయానని తెలిపాడు. సంజూ శాంసన్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడని అభిప్రాయపడ్డాడు. ఇక న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైన సంజూ శాంసన్‌కు టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. రిషభ్ పంత్ వరుసగా విఫలమవుతున్నా అతనికి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న టీమిండియా.. సంజూ శాంసన్‌కు మాత్రం అవకాశం ఇవ్వకపోవడం ఏంటని అభిమానులు బీసీసీఐని నిలదీసారు. సౌత్ ఇండియాకు చెందినవాడు కావడం వల్లే అతనిపై వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు.

ఆడిన మ్యాచ్‌ల కంటే..
ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మనీశ్ పాండే.. సంజూ శాంసన్‌లానే తనకు అన్యాయం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'భారత జట్టులో ఉన్నప్పుడు నేను కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. నేను ఆడిన మ్యాచుల కంటే రిజర్వు బెంచ్‌లో కూర్చున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ. రిజర్వ్ బెంచ్‌లో ఖాళీగా కూర్చుంటే చాలా బాధగా ఉంటుంది. టీమ్‌లో ఉన్నవారి కంటే మనం తక్కువ అనే ఫీలింగ్ కలుగుతోంది. అయితే ఈ విషయంలో క్రీడా స్ఫూర్తి చాలా అవసరం. టీమ్‌కి ఎవరు అవసరమో కెప్టెన్, కోచ్ నిర్ణయిస్తారు. అంతే తప్ప! మనం తక్కువా? వాళ్లు ఎక్కువా అని కాదు.

మానసికంగా..
మన టైం వచ్చేదాకా వేచి చూడాలంతే. అయితే జట్టులో ప్లేస్ రాకపోయినా, రిజర్వు బెంచ్‌లో కూర్చున్నా.. అది మన ఆటపై ప్రభావం చూపించకుండా చూసుకోవాలి.. ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నాకు వచ్చిన మ్యాచుల్లో బాగా ఆడాలని తాపత్రయపడ్డాను. ఇప్పుడు సంజూ శాంసన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. వచ్చిన మ్యాచుల్లో బాగా ఆడుతున్నాడు. తను కూడా ఇదే మైండ్‌సెట్‌తో ఉంటే బెటర్.

రెడీగా ఉండాలి..
ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నాకు వచ్చిన మ్యాచుల్లో బాగా ఆడాలని తాపత్రయపడ్డాను. ఇప్పుడు సంజూ శాంసన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. వచ్చిన మ్యాచుల్లో బాగా ఆడుతున్నాడు. తను కూడా ఇదే మైండ్‌సెట్‌తో ఉంటే బెటర్. అవకాశం వచ్చినప్పుడు ఆడితే, టీమ్‌లో ప్లేస్ దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. త్వరలోనే టీమ్‌లో ప్లేస్‌ని తిరిగి సంపాదించుకుంటాననే నమ్మకం ఉంది.'అని మనీశ్ పాండే చెప్పుకొచ్చాడు.

తొలి ఐపీఎల్ సెంచరీ..
ఐపీఎల్ 2009లో సెంచరీ చేసిన మనీశ్ పాండే.. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో శతకం బాదిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. సెంచరీ చేసిన 6 ఏళ్లకు 2015లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన మనీశ్ పాండే... టీమిండియా తరుపున 29 వన్డేలు, 39 టీ20 మ్యాచులు ఆడాడు. గత ఐపీఎల్ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడిన మనీశ్ పాండే ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. దాంతో ఆ జట్టు మనీశ్ పాండేను వేలంలోకి వదిలేసింది. అయితే లక్నో నిర్ణయాన్ని తాను అర్థం చేసుకోగలనని పాండే తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications