గాయపడ్డ రిషభ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్, కేఎస్ భరత్ కంటే అతనే కరెక్ట్: మాజీ క్రికెటర్

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్థానాన్ని ఇషాన్ కిషన్ మాత్రమే భర్తీ చేయగలడని మాజీ క్రికెటర్ మణిందర్ సింగ్ అభిప్రాయపడ్డాడు. మూడు ఫార్మాట్లలో పంత్ స్థానాన్ని ఈ జార్ఖండ్ డైనమైట్‌తో భర్తీ చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. డిసెంబర్ 30న ఢిల్లీ- డెహ్రాడూన్ జాతీయ రహదారిపై పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. న్యూఇయర్‌కు తల్లికి సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో సమాచారం ఇవ్వకుండా ఢిల్లీ నుంచి ఒక్కడే స్వయంగా డ్రైవ్ చేస్తూ రూర్కీ బయలు దేరిన పంత్.. నిద్రమత్తులో డివైడర్ రేలింగ్‌ను ఢీకొట్టాడు.

పంత్ 6 నెలలు దూరం..
ఈ ప్రమాదంతో అతని కారు పూర్తిగా దగ్దమవ్వగా.. ఓ బస్సు డ్రైవర్ సాయంతో పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. డెహ్రాడూన్ మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్‌కు నుదిటిపై రెండు కాట్లు పడటంతో పాటు మొకాలి లింగ్‌మెంట్‌లో ఫ్రాక్టర్, మడమ, బొటన వేలికి గాయాలయ్యాయి. వీపు భాగంలో కూడా గాయాలయ్యాయి. దాంతో అతను సుమారు 6 నెలల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఐపీఎల్ 2023 సీజన్‌తో పాటు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు పంత్ దూరం కానున్నాడు.

సంజూ, భరత్ కంటే..
వన్డే ప్రపంచకప్ టీమ్‌లో కీలకమైన రిషభ్ పంత్ ఇలా అనూహ్యంగా దూరమవడం టీమిండియా మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. పంత్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలి అనేదానిపై ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంత్‌కు ప్రత్యామ్నాయ ఆటగాళ్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ రేసులో ఉన్నారు. అయితే మణిందర్ సింగ్ మాత్రం మూడు ఫార్మాట్లలో ఇషాన్ కిషన్‌కే అవకాశం ఇవ్వాలన్నాడు. మైకేల్ చానెల్‌తో ఫోన్‌లో మాట్లాడిన మణిందర్ సింగ్.. పంత్ రిప్లేస్‌మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇషాన్ కిషనే సరైనోడు...
'దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంతో రిషభ్ పంత్ జట్టుకు దూరమైతే టీమ్ మేనేజ్‌మెంట్ ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయాలి. లెఫ్టాండర్ అయిన ఇషాన్ కిషన్ మూడు ఫార్మాట్లలో పంత్ స్థానాన్ని భర్తీ చేయగలడు. అతను ఏస్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం నిర్భయంగా ఆడగలిగే ఆటగాళ్లకు తుది జట్టులో అవకాశం ఇవ్వాలి. ఇషాన్ కిషన్ తనకు వచ్చి అతి కొద్ది అవకాశాలను అద్భుతంగా అందిపుచ్చుకున్నాడు. బంగ్లాదేశ్‌తో వన్డేల్లో డబుల్ సెంచరీ బాదాడు.

ఆ సామర్థ్యం అతనిదే..
బ్యాటర్లు తడబడుతున్న వికెట్‌పై ఇషాన్ కిషన్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగాడు. దూకుడైన స్వభావం ఇషాన్ కిషన్‌కు మరిన్నీ అవకాశాలు రానున్నాయి. అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాళ్లను ఎంపిక చేయడం టీమ్‌మేనేజ్‌మెంట్, సెలెక్టర్ల బాధ్యత. అలాంటి సత్తా ఉన్న ప్లేయర్ ఇషాన్ కిషన్. అతనో బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని నా గట్టి నమ్మకం. మూడు ఫార్మాట్లలో రిషభ్ పంత్ స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం అతనికే ఉందనేది నా విశ్వాసం.'అని మణిందర్ సింగ్ చెప్పుకొచ్చాడు. 57 ఏళ్ల మనిందర్ సింగ్ భారత్ తరఫున 35 టెస్ట్‌లు, 59 వన్డేలు ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications