Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: భారత్ ఘన విజయం!

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముల్లాన్‌పూర్ వేదికగా రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్.. ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్‌లో భారీ స్కోర్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత తమకు అలవాటైన రీతిలో స్పిన్ ఉచ్చులో బిగించింది. ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ అఫ్గానిస్థాన్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. టెస్ట్ క్రికెట్‌లోనే టీమిండియాకు ఇది అతిపెద్ద విజయం.

నిప్పులు చెరిగిన కుల్దీప్, సుందర్..

412 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అఫ్గానిస్థాన్ 35.5 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ సెదిఖుల్లా అటల్(80 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42), రెహ్మానుల్లా గుర్బాజ్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

IND vs AFG Manav Suthar Washington Sundar and Kuldeep Yadav Dominate as India Beat Afghanistan in Mullanpur Test

వాషింగ్టన్ సుందర్(3/30), కుల్దీప్ యాదవ్(4/36) అఫ్గాన్ పతనాన్ని శాసించారు. మానవ్ సుతార్‌‌కు ఒక వికెట్ దక్కింది. గాయంతో షరాఫుద్దిన్ అష్రఫ్ బ్యాటింగ్‌కు రాలేదు. 14 పరుగుల వ్యవధిలోనే అఫ్గాన్ చివరి 6 వికెట్లు కోల్పోవడం గమనార్హం.

మలుపు తిప్పిన మానవ్ సుతార్

అంతకుముందు 113/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన అఫ్గాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు కుప్పకూలింది. రెహ్మత్ షా(135 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 60) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

భారత బౌలర్లలో మానవ్ సుతార్‌(6/33) 6 వికెట్లతో అఫ్గాన్ పతనాన్ని శాసించగా.. ప్రసిధ్ కృష్ణ(3/37) మూడు వికెట్లతో సత్తా చాటాడు. వాషింగ్టన్ సుందర్(1/21) ఒక వికెట్ దక్కింది. భారత్‌కు 412 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. టెస్ట్ క్రికెట్ అనుభవలేమి అఫ్గాన్ కొంపముంచింది. అఫ్గాన్ బ్యాటింగ్ వైఫల్యంతో మూడో రోజు ఆటలో రెండున్నర సెషన్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

భారత్ భారీ స్కోర్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 127 ఓవర్లలో 564/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. శుభ్‌మన్ గిల్(177 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 126), కేఎల్ రాహుల్(165 బంతుల్లో 11 ఫోర్లతో 100) సెంచరీలతో చెలరేగగా.. రిషభ్ పంత్(121 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81), వాషింగ్టన్ సుందర్(68 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. మానవ్ సుతార్ సైతం బ్యాటింగ్‌లో కీలకమైన 28 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్స్‌లు ఉన్నాయి.

Story first published: Monday, June 8, 2026, 15:28 [IST]
Other articles published on Jun 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+