IND vs AFG: చరిత్ర సృష్టించిన మానవ్ సుతార్.. 59 ఏళ్ల రికార్డ్ బద్దలు!
టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ చరిత్ర సృష్టించాడు. అరంగేట్ర టెస్ట్‌లోనే అత్యధిక వికెట్ల ఘనతను అందుకున్న రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. అఫ్గానిస్థాన్‌తో ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మానవ్ సుతార్(6/33) ఆరు వికెట్లు తీయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ఘనతను అందుకున్న 10వ భారత బౌలర్‌గా మానవ్ సుతార్ నిలిచాడు.
అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నరేంద్ర హిర్వాని ఉన్నారు. ఆయన 1988లో వెస్టిండీస్‌తో అరంగేట్ర మ్యాచ్‌లోనే తొలి ఇన్నింగ్స్‌లో (8/61) 8 వికెట్లు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ (8/75) 8 వికెట్లు పడగొట్టి టాప్-2 ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత మానవ్ సుతార్ (6/33) 6 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో మానవ్ సుతార్ 59 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. 1967లో ఆస్ట్రేలియాతో అరంగేట్ర మ్యాచ్‌లో అబిద్ అలీ (6/55) 6 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో అతన్ని మానవ్ సుతార్ అధిగమించాడు.

టెస్ట్ అరంగేట్ర ఇన్నింగ్స్‌లోనే 5 వికెట్ల ప్రదర్శన చేసిన భారతీయులు
నరేంద్ర హిర్వాణి - 8/61 వర్సెస్ వెస్ట్ ఇండీస్ (1988)
నరేంద్ర హిర్వాణి - 8/75 వర్సెస్ వెస్ట్ ఇండీస్ (1988)
మానవ్ సుతార్ - 6/33 వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (2026)*
అబిద్ అలీ - 6/55 వర్సెస్ ఆస్ట్రేలియా (1967)
దిలీప్ దోషి - 6/103 వర్సెస్ ఆస్ట్రేలియా (1979)
వామన్ కుమార్ - 5/64 వర్సెస్ పాకిస్తాన్ (1961)
అమిత్ మిశ్రా - 5/71 వర్సెస్ ఆస్ట్రేలియా (2008)
మహమ్మద్ నిస్సార్ - 5/93 వర్సెస్ ఇంగ్లాండ్ (1932)
అఫ్గాన్ పతనాన్ని శాసించిన మానవ్ సుతార్..
మానవ్ సుతార్(6/140) సిక్సర్‌తో అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు కుప్పకూలింది. రెహ్మత్ షా(135 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 60) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్‌కు తోడుగా ప్రసిధ్ కృష్ణ(3/37) మూడు వికెట్లతో సత్తా చాటాడు. వాషింగ్టన్ సుందర్(1/21) ఒక వికెట్ దక్కింది. భారత్‌కు 412 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్థాన్ 112 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసాడు. మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీసారు. గాయంతో అష్రఫ్ బ్యాటింగ్‌కు రాలేదు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 127 ఓవర్లలో 564/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. శుభ్‌మన్ గిల్(177 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 126), కేఎల్ రాహుల్(165 బంతుల్లో 11 ఫోర్లతో 100) సెంచరీలతో చెలరేగగా.. రిషభ్ పంత్(121 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81), వాషింగ్టన్ సుందర్(68 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. మానవ్ సుతార్ సైతం బ్యాటింగ్‌లో కీలకమైన 28 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్స్‌లు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications