Manav Suthar: మ్యాచ్ విన్నర్‌కు బంపరాఫర్!
అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చిన భారత అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్‌కు బంపరాఫర్ వరించింది. మొత్తం 7 వికెట్లతో అఫ్గాన్ పతనాన్ని శాసించిన మానవ్ సుతార్‌కు కౌంటీ క్రికెట్ ఆహ్వానం లభించింది. ప్రముఖ జట్టైన వార్విక్ షైర్ మానవ్ సుతార్‌తో రెండు మ్యాచ్‌ల ఒప్పందం చేసుకుంది. ఇది మానవ్ సుతార్ ఆటను మరింత మెరుగుపర్చనుంది. ముఖ్యంగా ఇంగ్లండ్ గడ్డపై జరిగే మ్యాచ్‌లకు కౌంటీఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు ఉపయోగపడనున్నాయి.
ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను వార్విషైర్ మేనేజ్‌మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. 'మా బౌలింగ్ యూనిట్‌కు మానవ్ సుతార్ వైవిధ్యం తీసుకొస్తాడు. కౌంటీ ఛాంపియన్‌షి విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తాం. అతనితో మేం ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉంది.'అని వార్విక్ షైర్ పేర్కొంది. మరోవైపు కౌంటీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తానని మానవ్ సుతార్ తెలిపాడు.

అఫ్గాన్‌తో ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్ట్‌తో మానవ్ సుతార్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. వెటరన్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లేని లోటును భర్తీ చేస్తూ.. ఈ యువ స్పిన్నర్ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టి అరంగేట్ర మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ఘనతను అందుకున్న పదో భారత బౌలర్‌గా నిలిచాడు. మానవ్ సుతార్ అద్వితీయమైన ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
మానవ్ సుతార్ 29 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 129 వికెట్లు పడగొట్టాడు. అతని బెస్ట్ బౌలింగ్ గణంకాలు 11/62. లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటం అతనికి కలిసొచ్చే అంశం. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 950+ పరుగులు చేశాడు.
మానవ్ సుతార్‌ది రాజస్థాన్‌లోని గంగానగర్ అనే చిన్న పట్టణం. ఇది పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో ఉంటుంది. సుతార్ తండ్రి జగదీష్ ప్రభుత్వ పీఈటీ. సుతార్ క్రికెట్ పట్ల ఆసక్తిని ప్రదర్శించడంతో ఆ దిశగా ప్రోత్సహించాడు. స్పిన్ బౌలింగ్ మాత్రమే కాదు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటేవాడు.
2022-23 రంజీ ట్రోఫీలో 6 మ్యాచ్‌ల్లోనే 39 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఎమర్జింగ్ ఆసియా కప్‌లో 5 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసాడు. 2024 దులీప్ ట్రోఫీలో భారత్ సీ తరఫున 7 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనే అతనికి టీమిండియా పిలుపు దక్కేలా చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications