Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మొత్తానికి నా తమ్ముడిని నాకు అన్నను చేశావ్.. వికీపిడియాపై స్టార్ క్రికెటర్ సోదరి సెటైర్స్

Malti Chahar trolls brother Deepak Chahar over age on Wikipedia

న్యూఢిల్లీ: వికీపీడియాపై టీమిండియా యువ పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి, మోడల్ మాలతీ చాహర్ వ్యంగ్యస్త్రాలు సంధించింది. వికీపిడియా తప్పిదాన్ని ట్విటర్ వేదికగా పంచుకుంటూ తనదైన శైలిలో సెటైర్లు పేల్చింది. ఈ చెన్నై స్టార్ పేసర్ వయసును వికీపీడియా తప్పుగా పేర్కొంది. 28 ఏళ్ల చాహర్‌కు 48 ఏళ్ల వయసని సూచించింది. ఈ విషయాన్ని గమనించిన మాలతీ చాహర్.. తన తమ్ముడిని తనకు అన్నగా మార్చినందుకు ధన్యవాదాలని తెలిపింది. తమ సోదురుడు 48 ఏళ్ల ఫిట్టెస్ట్ క్రికెటర్ అని తన ట్వీట్‌ చేసింది.

'వికీపీడియాకు ధన్యవాదాలు.. మొత్తానికి దీపక్‌ను నాకంటే పెద్దోడిని చేశావ్. 48 ఏళ్ల వయసులో కూడా ఫిట్టెస్ ప్లేయర్‌ని చెప్పావ్'అని ట్వీట్ చేసింది.
ఇక మాలతీ చాహర్ షేర్ చేసిన ఫొటోలో.. దీపక్ చాహర్ వన్డే, టీ20 అరంగేట్రానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అలాగే దీపక్ చాహర్ వయసు 48 ఏళ్లని, 1972 ఆగస్టు 7న పుట్టాడని ఉంది. వాస్తవానికి దీపక్ 1992 ఆగస్టు 7న జన్మించాడు. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు సైతం వికీపీడియాపై వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.

వికీపీడియా సమాచారంతోనే చెన్నై సూపర్ కింగ్స్ దీపక్ చాహర్‌ను తీసుకున్నట్లుందని ఒకరంటే.. అంతా చెన్నై డాడీ ఆర్మీ మహిమా? అని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొందరూ ఇక నుంచి దీపక్‌ను అన్నయ్యా అని పిలవమని మాలతీకి సూచిస్తున్నారు. దాంతో మాలతీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఇక మాలతీ చాహర్, దీపక్ చాహర్ తోబట్టువుల కాగా.. ముంబై ఇండియన్స్‌కు చెందిన రాహుల్ చాహర్ కజిన్ అన్న విషయం తెలిసిందే. ఇక మాలతీ తన ఇద్దరి సోదరులను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా వేదికగా ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది.

ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్ ఆడిన దీపక్ చాహర్.. మూడు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అనంతరం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున బరిలోకి దిగిన చాహర్.. తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. కీలక నాకౌట్ మ్యాచ్‌లో గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఎన్‌సీఏలో చికిత్స తీసుకుంటున్నాడు.

Story first published: Monday, February 1, 2021, 13:42 [IST]
Other articles published on Feb 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+