Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs SRH: మాల్దీవుల్లో చిల్ అయితే ఫలితం ఇలానే ఉంటుంది!

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఓటమిపాలైంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ 38 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తయ్యింది. ఈ ఓటమితో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. అద్భుతం జరిగితే తప్పా ఆరెంజ్ ఆర్మీ ఈ టోర్నీలో ముందడుగు వేయలేదు. పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్.. పసలేని బ్యాటింగ్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిని శాసించింది.

ఈ మ్యాచ్ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాక్టీస్ చేయకుండా మాల్దీవుల్లో చిల్ అయితే ఫలితాలు ఇలానే ఉంటాయని మండిపడుతున్నారు. గత నెల 25వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌కు వారం రోజులు గ్యాప్ వచ్చింది. ఈ ఖాళీ సమయాన్ని ప్రిపరేషన్ కోసం వాడుకోకుండా సన్‌రైజర్స్ జట్టు రిఫ్రెష్ కోసమని మాల్దీవులకు వెళ్లింది. అక్కడ నాలుగు రోజుల పాటు ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు.. చిల్ అయ్యారు. వాలీబాల్ ఆడుతూ అక్కడి అందాలను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

Maldives Hangover SRH Heavily Trolled Following Defeat to GT in IPL 2025

రిఫ్రెష్ ఏమో కానీ..ఈ బ్రేక్ కారణంగా సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఉన్న ఆటను కూడా మర్చిపోయారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్ల ఫీల్డింగ్ తప్పిదాలు చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. మాల్దీవుల బ్రేక్ కారణంగా సన్‌రైజర్స్ ఆటగాళ్లు రిథమ్ కోల్పోయారని, బౌలర్లు అయితే అత్యంత చెత్త ప్రదర్శన చేశారని మండిపడుతున్నారు. కొందరైతే.. మాల్దీవ్స్ మత్తు వదల్లేదా మామ అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి 4 మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్ చేరలేని పరిస్థితి నెలకొంది. నాలుగు నాలుగు గెలిస్తే ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అద్భుతం జరిగితే తప్పా.. ఆరెంజ్ ఆర్మీకి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కదు. మరో మ్యాచ్ ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమిస్తోంది. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఢిల్లీ(మే 5), కేకేఆర్(మే 10), ఆర్‌సీబీ(మే 13), లక్నో సూపర్ జెయింట్స్‌(మే 18)తో తలపడనుంది.

Story first published: Saturday, May 3, 2025, 6:55 [IST]
Other articles published on May 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+