IND vs PAK: హైఓల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ కొంపముంచిన స్లో ఓవర్ రేట్!

హైదరాబాద్: ఆసియాకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ల్లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే సస్పెన్స్ థ్రిల్లర్ తలపించిన ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజాను అందించింది. విజయం రెండు జట్ల మధ్య ఊగిసలాడటంతో అభిమానుల ఉత్కంఠకు ఊపిరి అందలేదు. పేలవ బ్యాటింగ్‌తో పాకిస్థాన్ తక్కువ స్కోర్‌కే పరిమితమైనా.. తమ పేస్‌తో గడగడలాడించింది. అరంగేట్ర పేసర్ నసీమ్ షా భారత ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. షాహిన్ షా అఫ్రిది లేని లోటును తీర్చాడు. దాంతో పాక్ సైతం విజయం దిశగా నడిచింది.

కలిసొచ్చిన స్లో ఓవర్ రేట్..
అయితే ఈ క్రమంలో ఆ జట్టు చేసిన ఘోర తప్పిదం మ్యాచ్ ఓటమికి కారణమైంది. స్లోఓవర్ రేట్ భారత్‌కు కలిసొచ్చింది. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో కొత్త నిబంధనల ప్రకారం అంపైర్లు చర్యలు తీసుకున్నారు. పెనాల్టిగా చివరి ఓవర్లలో సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లను మాత్రమే పరిమితం చేశారు. చివరి మూడు ఓవర్లలో పాక్ సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లతోనే ఆడింది. ఇది భారత బ్యాటర్లకు అడ్వాంటేజ్‌గా మారింది. నసీమ్ షా వేసిన 18వ ఓవర్‌లో జడేజా ఈ ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్‌తోనే భారీ సిక్సర్‌తో పాటు బౌండరీ రాబట్టాడు. హ్యారీస్ రౌఫ్ వేసిన 19వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా మూడు బౌండరీలతో విరుచుకుపడ్డాడు.

భారత్ సైతం..
ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం.. నిర్ణీత సమయంలోపు చివరి ఓవర్ ప్రారంభించలేకపోతే ఆ టీమ్‌కు ఐదుగురు బదులు నలుగురు ఫీల్డర్లనే సర్కిల్ బయట ఉంచే అవకాశం ఇస్తారు. ఈ ఏడాది జనవరి 16 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌కు కూడా ఈ పెనాల్టీ పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా చివరి ఓవర్‌లో భారత్.. సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లతోనే ఆడింది. దాంతో పాక్ బ్యాటర్ షానవాజ్ దహాని చెలరేగాడు.

హార్దిక్ ఆల్‌రౌండ్ షో..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ రిజ్వాన్(43), షానవాజ్ దహాని(16) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వకుమార్ నాలుగు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా..ఆవేశ్ ఖాన్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 148 పరుగులు చేసి గెలుపొందింది. బౌలింగ్‌లో మెరిసిన హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33 నాటౌట్) బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. అతనికి అండగా విరాట్ కోహ్లీ(35), రవీంద్ర జడేజా(35) రాణించారు. పాక్ బౌలర్లలో అరంగేట్ర పేసర్ నసీమ్ షా రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ నవాజ్ మూడు వికెట్లతో చెలరేగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications