న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీలకే సాధ్యం కాలేదు.. టీ20లో నేపాల్‌ కెప్టెన్‌ సరికొత్త రికార్డు!!

Maiden T20I ton, Nepal captain Paras Khadka creates World Record

సింగపూర్‌: మైదానంలో పరుగుల వరద పారించే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలకే సాధ్యంకాని అంతర్జాతీయ టీ20 రికార్డును నేపాల్‌ కెప్టెన్‌ పరాస్‌ ఖడ్కా అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో ఛేజింగ్‌లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా పరాస్‌ ఖడ్కా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఛేజింగ్‌లో పరాస్‌ 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 106 పరుగులు చేశాడు.

<strong>ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రోహిత్ డకౌట్‌.. డబుల్‌ సెంచరీకి ఇంకా 200 పరుగులు మాత్రమే!!</strong>ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రోహిత్ డకౌట్‌.. డబుల్‌ సెంచరీకి ఇంకా 200 పరుగులు మాత్రమే!!

టీ20ల్లో తొలి సెంచరీ:

టీ20ల్లో తొలి సెంచరీ:

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా సింగపూర్‌, నేపాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌ పరాస్‌ ఖడ్కాసెంచరీ చేసి అంతర్జాతీయ టీ20 చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఛేజింగ్‌లో సెంచరీ నమోదు చేసిన తొలి కెప్టెన్‌గా రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక నేపాల్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో తొలి సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా కూడా పరాస్‌ రికార్డులోకి ఎక్కాడు. అంతేకాదు 49 బంతుల్లోనే సెంచరీ సాధించిన నాలుగో ఆసియా కెప్టెన్‌గా కూడా నిలిచాడు.

స్టీవ్ స్మిత్@4

స్టీవ్ స్మిత్@4

ఇంతకుముందు ఒక జట్టు కెప్టెన్ టీ20ల్లో చేసిన అత్యధిక పరుగులు 96. రెండు వారాల క్రితం నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ స్కాట్లాండ్ జట్టుపై అజేయంగా 96 పరుగులు చేశాడు. ఈ జాబితాలో స్టీవ్ స్మిత్ (2015లో 90 vs ఇంగ్లాండ్) నాల్గవ స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ (2009లో 88 vs ఆస్ట్రేలియా) ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. స్టీవ్ స్మిత్, కెప్టెన్ విరాట్ కోహ్లీలకే సాధ్యంకాని అంతర్జాతీయ టీ20 రికార్డును పరాస్‌ తన పేరుపై లికించుకోవడంతో ప్రశంసలు కురుస్తున్నాయి.

రాణించిన సింగపూర్‌ కెప్టెన్‌:

రాణించిన సింగపూర్‌ కెప్టెన్‌:

శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పరాస్‌ ఖడ్కా సెంచరీతో చెలరేగడంతో నేపాల్‌ సునాయాస విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సింగపూర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. సింగపూర్‌ కెప్టెన్‌ టిమ్‌ డేవిడ్‌ (64 నాటౌట్‌) అర్ధ సెంచరీతో రాణించగా.. సురేంద్రన్‌ చంద్రమోహన్‌ (35) ఫర్వాలేదనిపించాడు. నేపాల్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో సింగపూర్‌ మోస్తరు స్కోరుకు పరిమితమైంది.

కోహ్లీ నన్ను గర్వపడేలా చేశాడు.. ఇక్కడ ఉన్నానంటే కారణం అతనే: అనుష్క శర్మ

145 పరుగుల భాగస్వామ్యం:

145 పరుగుల భాగస్వామ్యం:

అనంతరం లక్ష్య ఛేదనలో నేపాల్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్‌ పాండే (5) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. ఆపై పరాస్‌- ఆరిఫ్‌ షేక్‌లు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ జోడి సునాయాసంగా పరుగులు చేస్తూ.. నేపాల్‌కు విజయాన్ని అందించారు. ఈ జోడి 145 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముక్కోణపు సిరీస్‌లో మరో జట్టు జింబాంబ్వే.

Story first published: Sunday, September 29, 2019, 12:44 [IST]
Other articles published on Sep 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X