కోహ్లీ నన్ను గర్వపడేలా చేశాడు.. ఇక్కడ ఉన్నానంటే కారణం అతనే: అనుష్క శర్మ

ముంబై: ప్రతీ విషయంలోనూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, నా భర్త గర్వపడేలా చేసాడని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ అన్నారు. సతీమణి అనుష్క శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఇండియన్ స్పోర్టింగ్ ఆనర్ (ఐఎస్‌హెచ్)-2019 అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యాడు. ముంబైలోని ఎస్వీపీ స్టేడియంలో ఈ కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. మొత్తం 17 క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు అవార్డులను ప్రదానం చేశారు.

గర్వపడేలా చేశాడు:
ఈ సందర్భంగా అనుష్క శర్మ మాట్లాడుతూ... 'నా భర్త కోహ్లీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన కారణంగానే నేను ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న అథ్లెట్లను ప్రోత్సహిస్తూ.. కెరీర్‌లో వారు ఎదిగేందుకు తోడ్పడుతున్న ఏకైక కార్యక్రమం ఇదే అనుకుంటా. ఎన్నో విషయాల్లో కోహ్లీ నన్ను గర్వపడేలా చేశాడు. కోహ్లీ ఫౌండేషన్ అందులోని ఓ ప్రత్యేక అంశం. వర్ధమాన క్రీడాకారులను కోహ్లీ ప్రోత్సహించడం ఎంతో గర్వంగా ఉంది. అన్ని విభాగాలకు చెందిన క్రీడాకారులను గౌరవించే ఈ కార్యక్రమం భారత్‌లో క్రీడా సంస్కృతిని పెంపొందించడంలో తనవంతు పోషిస్తుంది' అని అన్నారు.

క్రీడా ప్రతిభను వెలికితీయాలి:
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'భారతదేశంలో క్రీడా ప్రతిభను వెలికితీయాల్సిన అవసరం ఉంది. ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది. వర్ధమాన క్రీడాకారులకు ప్రోత్సాహకంగా ఉపకార వేతనాలు కూడా అందిస్తున్నాం. దీంతో భారత్‌లో క్రీడా సంస్కృతికి బాటలు వేసే అవకాశం ఉంటుంది' అని పేర్కొన్నాడు.

ఫార్మల్ దుస్తుల్లో:
ఆర్‌పీ-ఎస్‌జీ గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయెంకా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. అనుష్క, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఫార్మల్ దుస్తులు ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనుష్కతో కలిసి ఉన్న ఫోటోలను కోహ్లీ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ కార్యక్రమానికి సానియా మీర్జా, అజింక్య రహానే, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, స్మృతి మంధాన, బజరంగ్ పునియా, నీరజ్ చోప్రా తదితర క్రీడాకారులు హాజరయ్యారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే:
నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ అవార్డులను ప్రదానం చేయాలనుకున్నా.. ఫుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. మొత్తం 11 కేటగిరీల్లో అవార్డులను ఐఎస్‌హెచ్ జ్యూరీ నిర్ణయించగా.. ఆరు పాపులర్ ఛాయిస్ అవార్డులకు ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications