Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ‌కి బర్త్ డే విషెస్ చెప్పిన మహేశ్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్

Mahesh Babu and Rakul Preet Singh’s Birthday Wish for Virat Kohli

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నేడు 32వ జన్మదినం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులు, మాజీ, సహచర క్రికెటర్లతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు విరాట్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కింగ్ కోహ్లీకి ట్విటర్ వేదికగా బర్త్ డే విషెస్ చెప్పాడు. 'నా అభిమాన క్రికెటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలు. ఇలానే మీరు ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ భారతదేశం గర్వించేలా చేయాలని కోరుకుంటున్నా .. రాక్ ఆన్'అంటూ ట్వీట్ చేశాడు. ఇక టాలీవుడ్ టాప్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా టీమిండియా కెప్టెన్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసింది.

Mahesh Babu and Rakul Preet Singh’s Birthday Wish for Virat Kohli
Mahesh Babu and Rakul Preet Singh’s Birthday Wish for Virat Kohli

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్నట్టు ఇటీవలే మూవీ యూనిట్ ప్రకటించింది. ఇక రాజమౌళి దర్శకత్వంలోనూ మహేష్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

ఇక ఐపీఎల్ 2020 సీజన్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్లే ఆఫ్స్ చేరింది. గత నాలుగు సీజన్ల తర్వాత ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరింది. దాంతో ఎలాగైనా టైటిల్ కరువు తీర్చుకోవాలనే కసితో ఉంది. కోహ్లీసేన లీగ్‌ దశలో ఎలాగో నెట్టుకొచ్చినా ఇప్పుడే అసలైన సవాలు ఎదురుకానుంది. హైదరాబాద్‌ గత మూడు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదుండగా, బెంగళూరు గత నాలుగు మ్యాచ్‌లు ఓటమిపాలై నిరాశలో ఉంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రెండు జట్లు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి.

ఇక బెంగళూరు ఓపెనర్లలో పడిక్కల్‌ నిలకడగా రాణిస్తున్నా అతడికి సరైన జోడీ లేకపోయింది. మరోవైపు తర్వాత వచ్చే విరాట్‌ ఇకపై రెచ్చిపోవాల్సిన అవసరం ఉంది. అతడికి డివిలియర్స్‌ మెరుపులు తోడైతే పెద్ద కష్టమేమీ కాదు. లేదంటే ఎలిమినేటర్‌ మ్యాచ్‌ నుంచే ఇంటిముఖం పట్టాలి. ఇప్పటివరకు 14 మ్యాచ్‌ల్లో 460 పరుగులు చేసిన విరాట్ 46 సగటుతో కొనసాగుతున్నాడు.

Story first published: Thursday, November 5, 2020, 12:16 [IST]
Other articles published on Nov 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+