
హైదరాబాద్: 'కోహ్లీ నన్ను పెళ్లి చేసుకుంటావా?' అంటూ వార్తల్లో నిలిచిన ఇంగ్లాండ్ క్రికెటర్ డానియెల్లి వ్యాట్ మనందరికీ గుర్తే. తాజాగా ఈ అమ్మడి దృష్టి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హెయిర్ స్టైల్‌పై పడింది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించాడు. ధోని హెయిర్ స్టైల్‌కు ఫిదా అయిన డానియెల్లి 'ధోని హెయిర్ కట్ అయితే.. సూపర్' అని ట్వీట్ చేసింది. ఈ అమ్మడి ట్వీట్‌పై నెటిజన్లు వినూత్నంగా స్పందిస్తున్నారు.
'ఈ దిగ్గజ క్రికెటర్ దగ్గర కొన్ని టిప్స్ తీసుకో' అని డానియెల్లి వ్యాట్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. దీనికి డానియెల్లి స్పందిస్తూ.. 'నా హెలిక్యాప్టర్ షాట్ ఎంత దూరం వెళ్తుందో నేను ఖచ్చితంగా చెప్పలేను' అని సరదాగా బదులిచ్చింది. దీనికి 'చాలా దూరం వెళ్తుందని.. కొందరంటే.. మా కింగ్ ధోనిని తదేకంగా చూడకు' అని పోస్టులు పెట్టారు.
బుధవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోని తన అద్భుత ప్రదర్శన చేయడంతో చెన్నై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇటీవల వన్డే ముక్కోణఫు సిరీస్ కోసం భారత్‌కు వచ్చిన డానియెల్లీ భారత మహిళల జట్టుపై సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.