For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Cristiano Ronaldo సుద్దపూసేం కాదు.. గతంలో కోకాకోలా తాగమని చెప్పింది అతనే: జయవర్దనే

Mahela Jayawardene shares old picture of Cristiano Ronaldo endorsing Coca-Cola

కొలంబో: మూడు రోజుల క్రితం పుట్‌బాల్ స్టార్, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో చేసిన పని సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్‌లో అతను చేసిన పనికి ప్రముఖ బేవరేజస్ సంస్థ కోకాకోలా ఏకంగా రూ.29వేల కోట్లు నష్టపోయింది. యూఈఎఫ్‌ఏ యూరోకప్‌ 2020లో భాగంగా క్రిస్టియానో రొనాల్డో జట్టు కెప్టెన్‌ హోదాలో కోచ్‌ ఫెర్నాండో సాంటోస్‌తో కలిసి గత మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. అయితే తాను కుర్చీలో కూర్చునేటప్పుడు టేబుల్‌పై రెండు కోకకోలా బాటిల్స్‌ కనిపించాయి. వెంటనే వాటిని చేతిలోకి తీసుకొని పక్కన పెట్టేసి.. 'ఇలాంటివి వద్దు. మంచినీరు మాత్రమే తాగండి' అంటూ వాటర్‌ బాటిల్‌ను తన చేతిలో తీసుకొని చెప్పాడు. .

రొనాల్డో దెబ్బకి ​కోకాకోలా స్టాక్‌ ధరలు 1.6 శాతానికి పడిపోయి.. 238 బిలియన్ల అమెరికన్‌ డాలర్లకు చేరింది. అంతకు ముందు కోకాకోలా విలువ 248 బిలియన్ల డాలర్లు ఉండింది. దీంతో 4 బిలియన్ల డాలర్లు (మన కరెన్సీలో 29 వేల కోట్ల దాకా) నష్టం వాటిల్లినట్లయ్యింది. ఇక రొనాల్డో చేసిన పనికి సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే ఓ శ్రీలంక అభిమాని రొనాల్లోను ప్రశంసిస్తూ.. తమ దేశ మాజీ క్రికెటర్లు అయిన కుమార సంగక్కర, మహేలా జయవర్ధనేలను తప్పుబట్టాడు. 'రొనాల్డో నీవు చేసిన పని పట్ల గర్వంగా ఫీలవుతున్నా. సెలబ్రిటీ పవర్ ఏంటో చూపించావు. మాకు ఉన్నారు సెలెబ్రిటీలు జయవర్దనే, సంగక్కర కూల్ డ్రింక్స్‌ను ప్రమోట్ చేస్తారు'అని కామెంట్ చేశాడు.

ఇక ఈ విమర్శలపై పరోక్షంగా స్పందించిన జయవర్దనే.. క్రిస్టియానో రొనాల్డో ఏమైనా సుద్దపూసనా? గతంలో అతను అదే కోకాకోలా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడని గుర్తు చేశాడు. కాకపోతే నేరుగా కాకుండా తనదైన శైలిలో సెటైర్లు పేల్చాడు. 'మరొకసారి అంబాసిడర్‌గా ఉంటే పారా చూట్ లేకుండా చేయాలి'అని ట్వీట్ చేశాడు. దీనికి రొనాల్డో కోకాకోలా అడ్వర్టైజ్‌మెంట్ ఫొటోలు జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 2006లో రొనాల్డో కోకాకోలా బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో 25 కోట్ల (250 మిలియన్లు) ఫాలోవర్లను సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా క్రిస్టియానో రొనాల్డో ఇప్పటికే రికార్డు సృష్టించాడు.

Story first published: Friday, June 18, 2021, 16:14 [IST]
Other articles published on Jun 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+