For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: అర్జున్ టెండూల్కర్ అరంగేట్రంపై ముంబై కోచ్ ఏమన్నాడంటే..?

Mahela Jayawardene says Arjun Tendulkar’s IPL debut Depends on team combination

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్ అందరికన్నా ముందే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. పేలవ బ్యాటింగ్‌కు తోడు బలహీనమైన బౌలింగ్ ఆ జట్టును దెబ్బతీసింది. ముఖ్యంగా ఆ టీమ్ కాంబినేషన్ ఇంకా సెట్ అవ్వలేదు. యువ ఆటగాళ్లతో మిడిలార్డర్ బలహీనంగా ఉండగా.. సీనియర్ ప్లేయర్ల వైఫల్యం, నిలకడలేని బౌలింగ్ వరుస పరాజయాలకు కారణమైంది. అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై అద్బుత విజయాన్నందుకొని పరాజయాల పరంపరంకు ముగింపు పలికింది.

8 పరాజయాల తర్వాత..

8 పరాజయాల తర్వాత..

8 పరాజయాల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. అరంగేట్ర ప్లేయర్ కుమార కార్తికేయ ఫస్ట్ మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడంతో ముంబై తమ బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనుంది. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం కూడా ఉంటుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే అర్జున్ టెండూల్కర్ అరంగేట్రంపై ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్దనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీమ్ కాంబినేషన్‌ను బట్టి..

టీమ్ కాంబినేషన్‌ను బట్టి..

గురువారం ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న జయవర్దనేను అర్జున్ అరంగేట్రం గురించి ప్రశ్నించగా.. టీమ్ కాంబినేషన్‌పై అది ఆధారపడి ఉందన్నాడు. 'జట్టులోని ప్రతీ ఒక్కరు ఆప్షనే. పరిస్థితులను బట్టి ఎవరిని ఆడించాలనేదానిపై నిర్ణయం తీసుకుంటాం. ఆటగాళ్ల ఎంపికా అనేది మ్యాచ్ ఫలితాలను బట్టి ఉంటుంది. జట్టు విజయం కోసం కావాల్సిన కాంబినేషన్‌ను ఎంపిక చేయడమే మా ప్రాధాన్యత. ప్రతీ మ్యాచ్ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది. మేం మా మొదటి విజయాన్ని అందుకున్నాం. ఇది ఇలానే కొనసాగించాలి. అత్యుత్తమ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలి. అందులో అర్జున్ టెండూల్కర్ కూడా ఉంటే అతన్ని ఆడించడాన్ని పరిశీలిస్తాం. అయితే ఇది టీమ్ కాంబినేషన్‌పై ఆధారపడి ఉంటుంది.'అని జయవర్దనే తెలిపాడు.టీమ్ కాంబినేషన్‌ను బట్టి..

గురువారం ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న జయవర్దనేను అర్జున్ అరంగేట్రం గురించి ప్రశ్నించగా.. టీమ్ కాంబినేషన్‌పై అది ఆధారపడి ఉందన్నాడు. 'జట్టులోని ప్రతీ ఒక్కరు ఆప్షనే. పరిస్థితులను బట్టి ఎవరిని ఆడించాలనేదానిపై నిర్ణయం తీసుకుంటాం. ఆటగాళ్ల ఎంపికా అనేది మ్యాచ్ ఫలితాలను బట్టి ఉంటుంది. జట్టు విజయం కోసం కావాల్సిన కాంబినేషన్‌ను ఎంపిక చేయడమే మా ప్రాధాన్యత. ప్రతీ మ్యాచ్ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది. మేం మా మొదటి విజయాన్ని అందుకున్నాం. ఇది ఇలానే కొనసాగించాలి. అత్యుత్తమ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలి. అందులో అర్జున్ టెండూల్కర్ కూడా ఉంటే అతన్ని ఆడించడాన్ని పరిశీలిస్తాం. అయితే ఇది టీమ్ కాంబినేషన్‌పై ఆధారపడి ఉంటుంది.'అని జయవర్దనే తెలిపాడు.

రోహిత్ సైతం..

రోహిత్ సైతం..

రోహిత్ శర్మ బ్యాటింగ్‌పై స్పందించిన మహేళ జయవర్దనే.. బ్యాటింగ్‌ వైఫల్యంపై అతను నిరాశగా ఉన్నాడని చెప్పాడు. అయితే రోహిత్ బ్యాటింగ్ వైఫల్యం కన్నా తమ ప్రణాళికలను అమలు చేయడమే ముఖ్యమని తెలిపాడు. 'సుదీర్ఘ కాలంగా రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇతర బ్యాటర్లు అతన్ని అనుసరించారు. అయితే సరైన ఆరంభాలను అందించలేకపోతున్నామనే నిరాశగా ఉన్నాడు. అయితే గేమ్ ప్రణాళికలను అమలు చేయడం ముఖ్యం. ఇషాన్ కిషన్‌ బ్యాటింగ్ గురించి మాట్లాడాను. సహజశైలిలో ఆడామని సూచించాను'అని జయవర్దనే చెప్పుకొచ్చాడు.

 రూ. 30 లక్షలకు అర్జున్

రూ. 30 లక్షలకు అర్జున్

ఐపీఎల్ 2022 సీజన్‌లో అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ రూ.30లక్షలకు కొనుగోలు చేసింది. అయితే అతనికి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు. ప్రధాన పేసర్లంతా విఫలమైన నేపథ్యంలో అర్జున్ ఆడటం ఖాయమని అంతా భావించారు. అర్జున్ సైతం నెట్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. స్టన్నింగ్ డెలివరీతో ఇషాన్ కిషన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వీడియోను ముంబై ఫ్రాంచైజీ అభిమానులతో పంచుకుంది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం దక్కనుంది.

Story first published: Thursday, May 5, 2022, 19:05 [IST]
Other articles published on May 5, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+