Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు గెలిచే సీన్ లేదు..బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆస్ట్రేలియాదే: జయవర్దనే

Mahela Jayawardene predicts Australia to win Border Gavaskar Trophy in India

న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై శ్రీలంక దిగ్గజ క్రికెటర్ మహేళ జయవర్దనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ వేదికగా జరగనున్న ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. ఈ సిరీస్‌లో హోరాహోరీ పోరు తప్పదన్నాడు.

ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియా ఈ సిరీస్ గెలవడం కీలకం. మరోవైపు 2004 నుంచి సొంతగడ్డపై భారత్‌ను ఓడించలేకపోతున్న ఆస్ట్రేలియా.. ఈసారి ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటుంది.

రెండు సార్లు మాత్రమే..

రెండు సార్లు మాత్రమే..

కేవలం రెండే రెండు సార్లు భారత్‌ను సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఓడించింది. 1964, 2004 పర్యటనల్లో ఆసీస్ గెలుపొందింది. 2017లో చివరిసారిగా భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా.. పుణే వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో విజయం సాధించిన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఓడి 1-2తో సిరీస్ కోల్పోయింది. 2019, 2021లో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా వరుసగా టెస్ట్ సిరీస్‌లు గెలిచింది. 2021లో గాయాలతో సీనియర్ ఆటగాళ్లు దూరమైనా.. యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ముఖ్యంగా రిషభ్ పంత్, మహమ్మద్ సిరాజ్ సత్తా చాటారు.

ఆసీస్‌దే విజయం..

ఆసీస్‌దే విజయం..

ఈ సిరీస్ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ ఎడిషన్‌లో మాట్లాడిన జయవర్దనే.. అత్యంత ఆసక్తికరంగా ఈ సిరీస్ జరుగుతుందన్నాడు. 'నాకు తెలిసి ఈ సిరీస్ అత్యంత ఆసక్తికరంగా.. హోరాహోరీగా సాగనుంది. భారత్‌లోని పరిస్థితులను ఆసీస్ బ్యాటర్లు ట్యాకిల్ చేసే విధానం.. అలాగే పటిష్టమైన బౌలింగ్ లైనప్‌ను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.

ఏ జట్టు సిరీస్‌లో శుభారంభం చేసి, మూమెంటమ్ అందుకుంటుందో ఆ జట్టుకు విజయవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే ఈ రెండు జట్లలో ఎవరు గెలుస్తారని అడిగితే చెప్పడం చాలా కష్టం. ఓ శ్రీలంక వాసిగా ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా. బహుషా 2-1తో ఆసీస్.. ఈ సిరీస్ కైవసం చేసుకోవచ్చు. అయితే ఈ విజయం అంత సులువైనది కాదు.

శుభ్‌మన్ గిల్ జోరు కొనసాగిస్తే..

శుభ్‌మన్ గిల్ జోరు కొనసాగిస్తే..

ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వరుస సెంచరీలతో సూపర్ ఫామ్ కనబరుస్తున్న శుభ్‌మన్ గిల్.. రెడ్ బాల్ క్రికెట్‌లో కూడా రాణించగలడు. అతను టెక్నికల్‌ బ్యాటర్. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్‌పై కూడా అతను జోరు కనబర్చనున్నాడు.

వైట్ బాల్ క్రికెట్ జోరును రెడ్ బాట్ క్రికెట్‌లో కూడా కొనసాగిస్తే అతనికి తిరుగుండదు. పరిపక్వతతో పాటు పరిస్థితులను అర్థం చేసుకోని ఆడితే భారత్‌కు గొప్ప ఆస్థిగా మారుతాడు. వైట్ బాల్ క్రికెట్ మాదిరి మంచి ఆరంభం అందిస్తే ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడికి లోనవుతారు.'అని జయవర్దనే చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, February 6, 2023, 15:03 [IST]
Other articles published on Feb 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+