Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rajvardhan Hangargekar: చిక్కుల్లో సీఎస్‌కే యువ బౌలర్.. అండర్ 19 ప్రపంచకప్ హీరోపై చీటింగ్ ఆరోపణలు!

Maharashtra Sports commissioner Accuses CSK’s Rajvardhan Hangargekar of age fraud

న్యూఢిల్లీ: అండర్ 19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన భారత యువ బౌలర్ రాజవర్దన్ హంగర్గేకర్ చిక్కుల్లో పడ్డాడు. వయసు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని హంగర్గేకర్ చీట్ చేశాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వెస్టిండీస్ వేదికగా ఇటీవల ముగిసిన అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో యశ్ ధుల్ సారథ్యంలోని భారత్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శనతో రాజవర్ధన్​ హంగర్గేకర్‌ ఆకట్టుకున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్​ వేలంలోనూ బంపర్​ ఆఫర్​ కొట్టేశాడు. చెన్నై జట్టు రూ. కోటిన్నర భారీ ధరకు కొనుగోలు చేసింది.

ఏజ్ ఫ్రాడ్ చేశాడని..

ఏజ్ ఫ్రాడ్ చేశాడని..

అండర్​-19 వరల్డ్​కప్​లో టీమిండియాకు ఆడిన హంగర్గేకర్​​.. వయసు తగ్గించి చూపాడని, బీసీసీఐ చీటింగ్ చేశాడని మహారాష్ట్ర స్పోర్ట్స్​ అండ్​ యూత్​ డిపార్ట్​మెంట్​ కమిషనర్​ ఓం ప్రకాశ్​ బకోరియా ఆరోపించారు. ఈ విషయాన్ని ఓ వార్తా పత్రిక వెల్లడించింది. ఈ మేరకు ఓంప్రకాశ్​ బీసీసీఐకి లేఖ కూడా రాసినట్లు పేర్కొంది. హంగర్గేకర్​ ప్రస్తుత వయసు 21 ఏళ్లు అని.. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నట్లు ఓంప్రకాశ్​ తన లేఖలో పేర్కొన్నారు.

2001 అయితే..

2001 అయితే..

హంగర్గేకర్​.. ధారాశివ్​లోని తెర్నా పబ్లిక్​ స్లూల్​లో చదివాడని ఓం ప్రకాశ్​ తెలిపారు. ఆ పాఠశాల రికార్డుల ప్రకారం హంగర్గేకర్​​ పుట్టినతేదీ 2001 జనవరి 10గా ఉందని.. అయితే ఎనిమిదో తరగతికి వచ్చాక హంగర్గేకర్​​ తన పుట్టినతేదీ వివరాలను మార్చుకున్నాడని ఆరోపించారు. ఆ తేదీని 2002 నవంబరు 10గా మార్పించుకున్నాడని లేఖలో ఆరోపించాడు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నాడు.

రెండేళ్ల నిషేధం..

రెండేళ్ల నిషేధం..

ఒకవేళ ఈ ఆరోపణలే నిజమైతే హంగర్గేకర్​కు ఇబ్బందులు తప్పవు. విచారణలో దోషిగా తేలితే బీసీసీఐ హంగర్గేకర్​పై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తుంది. అలా కాకుండా తన తప్పును దర్యాప్తునకు ముందే ఒప్పుకొంటే ఈ శిక్ష నుంచి హంగర్గేకర్​కు కొంత మినహాయింపు లభించే అవకాశం ఉంది.

ఈ తరహా ఘటనలు ఇదివరకు కూడా జరిగాయి. 2018 అండర్​-19 ప్రపంచకప్​ ఆటగాడు మన్జోత్​​ కల్రా కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

గతంలో షమీపై కూడా..

గతంలో షమీపై కూడా..

మాజీ ఆటగాడు కీర్తి ఆజాద్​ వ్యాఖ్యల ప్రకారం.. కల్రా అండర్​-16 స్థాయి నుంచే ఏజ్​ ఫ్రాడ్​కు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన బీసీసీఐ మన్జోత్​పై రెండేళ్ల పాటు నిషేధం విధించింది. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీపై అతని మాజీ భార్య హసీన్ జహాన్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేసింది.

Story first published: Friday, February 18, 2022, 18:21 [IST]
Other articles published on Feb 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+