ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వినోద్ కాంబ్లీకి బంపరాఫర్! నెలకు రూ. లక్ష జీతం..!

న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి ఓ వ్యాపార వేత్త బంపరాఫర్ ఇచ్చాడు. నెలకు లక్ష రూపాయాల వేతనంతో కూడిన ఉద్యోగాన్ని ఆఫర్ చేశాడు. అయితే క్రికెట్‌కు సంబంధించినది కాకుండా ఫైనాన్స్ రంగానికి చెందిన ఉద్యోగం ఇచ్చేందుకు తాను సిద్దంగా ఉన్నానని సదరు బిజినెస్‌మన్ తెలిపారు.
స్కూల్ డేస్‌లోనే సచిన్ టెండూల్కర్‌తో కలిసి రికార్డుల మోత మోగించేసిన వినోద్ కాంబ్లి.. ఆ తర్వాత భారత్ జట్టు తరఫున అరంగేట్రంలోనే డబుల్ సెంచరీలతో ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. కానీ.. మద్యానికి బానిసై ఎక్కువ కాలం క్రికెట్‌లో కొనసాగలేకపోయాడు. భారత్ తరఫున అతను 17 టెస్టులు, 104 వన్డేలు మాత్రమే ఆడాడు.

మధ్యానికి బానిసై..
క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఏ రంగాన్ని వినోద్ కాంబ్లి ఎంచుకోలేదు. కేవలం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి వస్తున్న పెన్షన్‌పైనే ఆధారపడుతూ వచ్చాడు. ప్రస్తుతం బీసీసీఐ నుంచి అతనికి నెలకి రూ.30,000 పెన్షన్ వస్తోంది. కానీ.. ఇప్పుడు తన కుటుంబ అవసరాలకి ఆ డబ్బు సరిపోవడం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఒకప్పటి సహచర క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఓ అకాడమీలో కోచ్‌గా పని ఇప్పించినా ప్రయాణం కష్టంగా ఉండటంతో మానేసినట్లు వినోద్ కాంబ్లి చెప్పుకొచ్చాడు.

సచిన్ సాయం చేసినా..
సచిన్ టెండూల్కర్ తనకెంతో చేశాడని కానీ ఇప్పుడు అతడ్ని సాయం అడగడం తనకి ఇష్టం లేదని చెప్పుకొచ్చిన వినోద్ కాంబ్లి.. ముంబయి క్రికెట్ అసోషియేషన్ (ఎంసీఏ)లో కోచ్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. 'ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) నుంచి సహాయం కోసం ఎదురుచూస్తున్నా. క్రికెట్ పురోగతి కమిటీ (సీఐసీ)లో నాకు స్థానం కల్పించారు. కాని అది గౌరవపూర్వక హోదా. నా కుటుంబాన్ని పోషించాలంటే ఆదాయం కావాలి. ఏదైనా పని ఉంటే చెప్పమని ఎంసీఏను చాలాసార్లు అడిగా'అని కాంబ్లీ పేర్కొన్నాడు.

తాగుబోతని భావించిన ఏంసీఏ
కానీ.. వినోద్ కాంబ్లి మద్యం వ్యసనం గురించి బాగా తెలిసిన ఎంసీఏ పెద్దలు అతనికి కోచ్ బాధ్యతలు అప్పగించేందుకు ఇష్టపడటం లేదు. దాంతో ఎంసీఏ చుట్టూ తాను తిరుగుతున్నట్లు చెప్పుకొచ్చిన వినోద్ కాంబ్లి.. క్రికెట్ కోచింగ్ పరంగా తనకి ఒక జాబ్ కావాలని ఆ ఇంటర్వ్యూలో అభ్యర్థించాడు.
ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన వ్యాపార వేత్త ఒకరు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అయితే క్రికెట్‌కు సంబంధించిన రంగంలో కాకుండా ఆర్థిక విభాగంలో అవకాశం ఇవ్వనున్నట్లు సదరు బిజినెస్‌మ్యాన్ సందీప్ తోరట్ వెల్లడించారు. నెలకు లక్ష రూపాయలు వేతనం చెల్లిస్తానని తెలిపారు. మరి వినోద్ కాంబ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications