ఐపీఎల్ టికెట్ల అమ్మకాలపై శివసేన నిషేధం!


ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ జరగడం కష్టమే అనిపిస్తుంది. దేశంలో రోజు రోజు పెరుగుతున్న బాధితుల సంఖ్యతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మెగా టోర్నీ నిర్వహించేందుకు జంకుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు టోర్నీని వాయిదా వేయాలని ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. మద్రాస్ హైకోర్టులోనూ ఈ క్యాష్ రిచ్ లీగ్ వాయిదా కోరుతూ ఓ పిటిషన్ కూడా దాఖలైంది. ఇక శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్ టికెట్ల అమ్మకాలపై నిషేధం విధించినట్లు ప్రచారం జరుగుతోంది.

టికెట్స్.. నో సేల్స్..
షెడ్యూలు ప్రకారం ఈ నెల 29న ఐపీఎల్ 2020 ప్రారంభం కావాల్సి ఉంది. ముంబైలోని వాంఖడే వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ముందు జాగ్రత్తగా భారీ జన సమూహాలు ఏర్పడకుండా చూడాలని శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఐపీఎల్ టికెట్ల విక్రయాన్ని నిషేధించిందనే వార్తలు వస్తున్నాయి.

రోడ్ సేఫ్టీ సిరీస్..
ప్రస్తుతం ముంబైలోని వాంఖడేలోనే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ జరుగుతోంది. భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులకు భారీ సంఖ్యలోనే అభిమానులు హాజరవుతున్నారు. దీనిని మాత్రం కూటమి ప్రభుత్వం వ్యతిరేకించలేదు! ఇదిలా ఉండగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం ఐపీఎల్ జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు.

షెడ్యూల్ ప్రకారమే..
'ఐపీఎల్ జరుగుతుంది. అన్ని దేశాల్లో క్రికెట్ టోర్నీలు కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్ ఇప్పటికే శ్రీలంక చేరుకుంది. దక్షిణాఫ్రికా భారత్‌కు వచ్చింది. ఇబ్బందులేమీ లేవు. కౌంటీ జట్లైతే ప్రపంచమంతా పర్యటిస్తున్నాయి. అబుదాబి, యూఏఈకీ వెళ్తున్నాయి. అక్కడ ఎలాంటి సమస్యలు లేవు. మేం ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. దేశంలోప్రతీ టోర్నీ జరుగుతుంది' అని గంగూలీ స్పష్టం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications